sunil hero jakkanna movie audio launch by megastar chiru

Sunil hero jakkanna movie audio launch by megastar chiru

sunil jakkanna audio, chiru speech about sunil, chiru about sunil, sunil about chiru, chiranjeevi, chiranjeevi next movie, chiru movie, chiru next movie, chiru 150th movie

hero sunil jakkanna movie audio launch by megastar chiranjeevi. this film going to be release in july and audio out in the market.

గ్రాండ్ గా జక్కన్న ఆడియో

Posted: 06/25/2016 10:30 AM IST
Sunil hero jakkanna movie audio launch by megastar chiru

సునీల్‌, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జక్కన్న’. అందాలరాముడు, మర్యాదరామన్న, కృష్ణాష్టమి వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌ తాజాగా ‘జక్కన్న’తో తన అదృష్టాన్నిపరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి చేతులమీదుగా ఈ ఆడియోని మార్కెట్ లోకి విడుదల చేసింది చిత్రయూనిట్. తను ఎంత బిజీగా ఉన్నా సునీల్ పైన ఉన్న అభిమానమే ఇక్కడకి రప్పించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యి సునీల్ ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పాడు. సునీల్ మాట్లాడుతూ, అన్నయ్య కొత్త సినిమా షూటింగ్ లో ఉండి కూడ ఆ షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసుకుని ఆడియో ఫంక్షన్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఏమిచ్చినా అన్నయ్య రుణం తీర్చుకోలేనిదని చెప్పాడు. నేను హీరో అయ్యాను అంటే అది కేవలం మెగాస్టార్ ఇన్ స్పిరేషనే అని మరోసారి సభాముఖంగా చెప్పాడు.

చిరంజీవి 150వ సినిమా షూటింగ్ జరుగుతున్నా కూడ మాకోసం ఆడియో ఫంక్షన్ కి వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు అని డైరెక్టర్ వంశీకృష్ణ చెప్పాడు. చిరంజీవి ఈ ఆడియో ఫంక్షన్ కి హాజరయిన వెంటనే నైట్ షెడ్యూల్ జరుగుతున్న తన 150వ సినిమా షూటింగ్ లొకేషన్ కి వెళ్లిపోయారు.

- మూర్తి
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero sunil  sunil comedy  director vamsy krishna  chiranjeevi audio funciton  

Other Articles