hero ram and anil ravipudi combination movie coming soon

Hero ram and anil ravipudi combination movie coming soon

hero ram, ram next movie, ram blind , ram blind charector, ram upcoming movie, ram vs anil ravipudi, anil director, director anil ravipudi, patas director, supreeme director, ram next film

hero ram and anil ravipudi combination movie coming soon. this movie ram as a special charector in 30 minuts episode, he is acting blind charector in this movie.

గుడ్డివాడిగా రామ్...!

Posted: 06/25/2016 10:43 AM IST
Hero ram and anil ravipudi combination movie coming soon

యువ కథానాయకులు కొత్త రకమైన కథలు, పాత్రలపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించగలిగే కమర్షియల్ అంశాలు ఉంటే అది ఎలాంటి కథైనా సరే వెంటనే ఓప్పేసుకుంటారు. యంగ్ ఎనర్జిటిక్ రామ్‌ కూడా తాజాగా అదే తరహా నిర్ణయం తీసుకొన్నాడు. తన 15వ చిత్రం ప్రత్యేకమైన కథతో తెరకెక్కబోతోందట. అందులో రామ్‌ అంధుడిగా కాసేపు కనిపించబోతున్నాట్లుగా చిత్రయూనిట్ నుంచి సమాచారం తెలుస్తోంది.


అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం వివరాల్ని రామ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. ‘నా తదుపరి చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అందులో నేను అంధుడిగా కనిపించనున్నప్పటికీ కమర్షియల్ గా సినిమా ఉంటుంది' అని అన్నాడు.  అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘నేను దర్శకత్వం వహించిన ‘సుప్రీమ్‌’ 50 రోజులు పూర్తి చేసుకొన్న సందర్భంలోనే నా కొత్త సినిమాని ప్రకటిస్తుండడం ఆనందంగా ఉంది. అదొక విభిన్నమైన కథతో తెరకెక్కుతుంద’ అన్నారు. ప్రస్తుతం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ ఆ సినిమా షెడ్యూల్ పూర్తవ్వగానే అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero ram  anil ravipudi  hansika  rasi khanna  ram potineni  ram hero  

Other Articles