హీరో రామ్‌చరణ్ తేజ్ మంచి జోరుమీదున్నాడు. ఇక నుంచి విరామం లేకుండా సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం ‘ధ్రువ’ చిత్రీకరణతో బిజీగా గడుపుతున్న ఆయన కోసం అప్పుడే కథని సిద్ధం చేశారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఆ చిత్రానికి సెప్టెంబరులో ముహూర్తం పెట్టేశారని తెలుస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ తర్వాత రామ్‌చరణ్ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుపైనే కసరత్తులు చేసాడట ఈ లెక్కల మాస్టర్.
ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథని చెర్రీ కోసం సిద్ధం చేసినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రంలో రామ్‌చరణ్ కనిపించే విధానం కూడా సరికొత్తగా సుకమార్ స్టైల్లో ఉంటుందట. సుకుమార్ సినిమాల్లో కథానాయకుల గెటప్పులు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. చెర్రీ కోసం కూడా సుక్కు ఓ కొత్త గెటప్‌ని రెడీ చేస్తున్నట్లుగా చెప్తున్నారు అందరూ.
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు. మిగతా టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ చెప్తోంది.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more