అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగటం దాదాపు ఖాయమయ్యింది. ఒకేసారి ఇద్దరు వారుసల ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలపై నాగార్జున స్పందించాడు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రెండు విషయాలపై ఓ స్పష్టత ఇచ్చాడు. ముఖ్యంగా నాగ్ చైతన్య-సమంత వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు నాగ్ మాటలతో అర్థమైంది.
‘‘చైతూ తన మనసుకు నచ్చిన అమ్మాయిని వెతుకున్నందుకు నేను అమలా చాలా హ్యాపీగా ఉన్నాం. త్వరలోనే ఆ విషయంపై ఓ ప్రకటన చేస్తాం’’ అటూ చెప్పేశాడు. దీంతో ఇన్నాళ్లూ వాళిద్దరి పెళ్లికి ఏర్పడ్డ ఆటంకులు తొలగిపోయాయి. ఇక మరో తనయుడు అఖిల్ ప్రేమ వ్యవహారంలోనే నాగ్ ఎటు తేల్చుకోలేకపోతున్నాడంట. ‘‘అఖిల్ కూడా ఓ అమ్మాయిని చూసుకున్నాడు. కానీ, వారిద్దరికి ఎంగేజ్ మెంట్ అని వస్తున్న వార్తలు అబద్ధం’’ అంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇద్దరు తమ తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వారికి ఆ ముచ్చట చేస్తామంటూ అందులో తేల్చేశాడు. త్వరలో ఇరు కుటుంబాల సమక్షంలో చైతూ-శామ్ ల ఎంగేజ్ మెంట్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి చైతూ సక్సెస్ అయితే, అఖిల్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more