actress trisha get chance in remake hindhi film queen

Actress trisha get chance in remake hindhi film queen

thyagarajan movies, trisha next movie, trisha nayaki, trisha horror films, trisha up coming, trisha kollywood, trisha and revathi, revathi director, revathi next movie, senior artist revathi

heroine trisha get chance in hidhi remake film queen. this movie is directed by senior heroine revathi and produced by thyagarajan

కోలీవుడ్ క్వీన్ గా త్రిష...!

Posted: 06/29/2016 04:14 PM IST
Actress trisha get chance in remake hindhi film queen

కోలీవుడ్ లో త్రిష వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. లేట్ వయసులోకూడ హీరోయిన్ గా మంచి మంచి ఆఫర్లను కొట్టేస్తోంది ఈ అమ్మడు. ముఖ్యంగా హారర్ జోనర్ ఎంచుకున్నప్పటి నుంచి తనలో నటనకి పదునుపెట్టింది. అందుకే ఇప్పుడు ఈమెకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ త్యాగరాజన్. హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన కంగనా రౌనత్ సినిమా క్వీన్ ని తమిళంలో రీమేక్ చేసేందుకు చూస్తున్నాడట త్యాగరాజన్. ఈ దశలో కంగనా రౌనత్ క్యారెక్టర్ లో త్రిషని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఈ సినిమా హిందీలో కంగనాకి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఒక మహిళా ప్రధాన ఇతివృత్తంలో సాగే కథే క్వీన్.

ఇప్పుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సీనియర్ హీరోయిన్ రేవతికి అప్పజెప్పే ఆలోచనలో ఉన్నాడట. రేవతి ఇదివరకు ఒక హిందీ సినిమా డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవతి త్రిషల కాంబినేషన్ ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. త్వరలోనే సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని, ఈ సినిమాని తెలుగులో కూడ డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు.


- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  trisha hot  trisha next movie  trisha songs  trisha queen movie  

Other Articles