megastar chiru in siima awards at sigapore

Megastar chiru in siima awards at sigapore

megastar at siima, chiru dance siima, chiru dance awards, chiru dance show in maa, chiru dance at siima, chirajneevi next movie, chiru 150th movie, chiru movie stars, chiru movie siima

megastar chiru in siima awards at sigapore, he is performed small steps in stage for his old heroines.

మళ్లీ చిందేసిన మెగాస్టార్...!

Posted: 07/01/2016 11:28 AM IST
Megastar chiru in siima awards at sigapore

సౌత్ ఇండియన్ సినిమా అవార్డుల వేదిక సైమా మెగాస్టార్ స్టెప్పులతో హోరెత్తిపోయింది. ఇటీవలే మా అవార్డు ఫంక్షన్ లో స్పెషల్ కాన్పెప్ట్ తో వచ్చి అందరినీ మెప్పించిన మెగాస్టార్ ఇప్పుడు మళ్లీ సింగపూర్ లో నిర్వహించిన సైమా అవార్డు వేదికలో కూడ సందడి చేశాడు. స్టేజ్ పైన తన పాత హీరోయిస్స్ తో కలిసి చిందేశాడు. రాధిక, సుహాసిని , మంచులక్ష్మీ, కుష్బూ, భావన తదితర హీరోయిన్స్ తో కలిసి సరదాగా రెండు స్టెప్పులేశాడు. ఆ స్టెప్పులకు స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. అందరి హర్షధ్వానాలతో సైమా స్టేజ్ అదిరిపోయింది. వాళ్లతో దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ సైట్ లో హల్ చల్ చేస్తోంది. మునుపటి కంటే ఎంతో యంగ్ గా చిరంజీవి కనిపిస్తున్నాడని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

సైమా వేదిక మొత్తం మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకి ఆల్ ద బెస్ట్ చెబుతూ అక్కడున్న వారందరికీ, మెగాస్టార్ కి సైతం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ అవార్డు ఫంక్షన్ తర్వాత చిరంజీవి నేరుగా తన 150వ సినిమా షూటింగ్ లో తర్వాత షెడ్యూల్ కి వస్తున్నట్లుగా తెలుస్తోంది.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles