సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్డ్డి నిర్మిస్తున్న చిత్రం మేము. ఈ సినిమాని పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ క్రేజీ స్టార్ సూర్య , అమాలాపాల్, తెలుగు సుందరి బిందుమాధవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జులై 8వ తేదిన తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధం చేసారు. 24 సినిమా తర్వాత వస్తున్న సూర్య సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమాని ఒక ఆర్ట్ ఫిల్మ్ గా ముందే చూపించడంతో ఆ ఫీల్ తోనే ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే అవకాశముందుని అందుకే సినిమా హిట్ అవుతుందని చెప్తున్నారు చిత్రయూనిట్ వర్గాలు.
ముఖ్యంగా ఈ సినిమాలో పిల్లలని తల్లిదండ్రులు ఎలా పెంచాలి ? వాళ్ల పాత్ర ఏంటి అనేదానిపైన సినిమాని చక్కగా తీసామని, ప్రతి పేరెంట్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని చెప్తున్నాడు దర్శకుడు. నేడు సమాజం పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది ? అందుకు పేరెంట్స్ గా మనమేం చెయ్యాలి అనే అంశాన్ని చక్కగా ఆవిష్కరించిన దర్శకుడికి హేట్సాఫ్ అంటూ సూర్య చేసిన ట్వీట్ ఇప్పుడు సినిమాపై మరింత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. తమిళంలో సినిమాకి మంచి రిపోర్ట్స్ వచ్చాయని, తెలుగు ప్రేక్షకులకు కూడ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చిత్రయూనిట్ మంచి కాన్ఫిడెంట్ గా ఉంది.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more