saidharam teja doing with gowtham menon direction in coming soon

Saidharam teja doing with gowtham menon direction in coming soon

sai dharam teja new , sai dharam teja movies, sai dharam teja tikka, sai dharam and gowtham menon, tamannah, anushka, sai dharam and tamannah, gowtham menon, director gowtham menon next

mega hero supreeme hero sai dharam teja doing gowtham menon direction in coming soon.

సుప్రీమ్ హీరో...క్రేజీ సినిమా..!

Posted: 07/01/2016 12:37 PM IST
Saidharam teja doing with gowtham menon direction in coming soon

మెగా కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి సుప్రీమ్ హీరో అంటూ అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు సాయి థరమ్ తేజ్. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్రని వేస్తున్నాడు. ఈసారి ఒక క్రేజీ కాంబినేషన్ కి తెరలేపాడు ఈ మెగా కుర్రాడు. డిఫెరెంట్ పోలీస్ గెటప్ తో ఆకట్టుకునే ఒక ప్రేమకథని గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేయనున్నాడట.

ఈ సినిమా ఒకేసారి పలు భాషల్లో ఉంటుందని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు. అయితే కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే సాయిథరమ్ తేజ్ ని డైరెక్టర్ గౌతమ్ మీనన్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. తమిళంలో శింబు, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్ లు నటించబోతున్నారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ గా తమన్నా, అనుష్కలు సందడి చేయనున్నారు.

ప్రస్తుతం గౌతమ్ మీనన్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా ఉండొచ్చని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు. మరి మెగా హీరోకి మంచి టైమ్ వచ్చినట్లేనని, సాయి థరమ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకుని టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోతున్నాడని చెబుతున్నారు సినీ పండితులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam teja  anushka shetty  tamannah  gowtham menon  simbhu  dhanush  

Other Articles