శ్రీదేవీ చాలా మందిని పంపిందంటున్న సీనియర్ డైరక్టర్ | kodandarami reddy says Sridevi sent producers for remake

Kodandarami reddy says sridevi sent producers for remake

Kodandarami Reddy about Sridevi, Sridevi sent producers to Kodandarami Reddy, kodanda ramreddy interview, sridevi producers

Senior Director Kodandarami Reddy says Sridevi sent producers for remaks but failed due to language problem.

శ్రీదేవి చాలా మందినే పంపిందన్న సీనియర్ డైరక్టర్

Posted: 07/01/2016 03:55 PM IST
Kodandarami reddy says sridevi sent producers for remake

అలనాటి అందాల తార శ్రీదేవీ తెలుగు ఇండస్ట్రీనే కాదు యావత్ భారత దేశాన్ని తన అందంతో ఉర్రూత లూగించింది. అదే టైంలో ఇటు సౌత్, అటు నార్త్ లోని టాప్ ప్రొడ్యూసర్లతో, దర్శకులతో మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ చేసింది. అందుకే డేట్లు దొరక్కపోతే వెయిట్ చేసి మరీ ఆమెతోనే సినిమా తీసే వాళ్లు.

అందులో సీనియర్ డైరక్టర్ కోదండా రామిరెడ్డి ఒకరు. ఆయన పలు హిట్ చిత్రాల్లో కూడా శ్రీదేవీ నటించింది. ఇక ఈ రోజు ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా కోదండ రాంరెడ్డి తన అనుభవాలను ఓ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అందులో శ్రీదేవీతో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆరోజుల్లో అలాగే హిందీ సినిమాలు చేయమంటూ నటి శ్రీదేవి తన దగ్గరకు చాలామంది ప్రొడ్యూసర్లను పంపించిందని, ఎందుకో అది కూడా కుదరలేదని ఆయన అలనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’, ‘శ్రీరంగనీతులు’, ‘ఛాలెంజ్’ ఇలా చాలా చిత్రాలను హిందీలో తీద్దామంటూ శ్రీదేవి అడిగేదని, తానే చేయలేకపోవడం బాధగా అనిపిస్తుందని అన్నారు. బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ నుంచి కూడా సినిమా చేద్దామని తనకు ఫోన్ వచ్చిందని, అయినా చేయలేకపోయానని అన్నారు. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉండటమే కాదు భాషా సమస్య కారణంగా హిందీలో చిత్రాలు తీయలేకపోయానని ఆయన చెప్పుకోచ్చారు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kodandarami Reddy  Sridevi  NTR  Chiranjeevi  

Other Articles