ఆల్ టైం హిట్ సాంగ్ ఇలా కూడా చేయొచ్చా? | belly dance to DDLJ’s Tujhe Dekha Toh Yeh Jaana Sanam song

Belly dance to ddlj s tujhe dekha toh yeh jaana sanam song

Couple Belly dance to DDLJ’s dong, Couple Belly dance to sharukh khan song, Maher Malik and partner, Maher Malik belly dance for DDLJ song, DDLJ song belly dance

Couple Belly dance to DDLJ’s Tujhe Dekha Toh Yeh Jaana Sanam song.Maher Malik and her partner from Banjara School of Dance are dancing to this song and winning the social media with their moves.

ఆల్ టైం హిట్ సాంగ్ ఇలా కూడానా...

Posted: 07/01/2016 04:36 PM IST
Belly dance to ddlj s tujhe dekha toh yeh jaana sanam song

దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే ఈ పేరు వింటే చాలు ఒక్క బాలీవుడే కాదు యావత్ దేశం యువత మొత్తం పరవశించిపోతుంది. 90లో వచ్చిన ఈ సినిమా ప్రేమలో రొమాన్స్ కి సరికొత్త బాష్యం చెప్పింది. రాజ్ -సిమ్రాన్ అదేనండీ షారూఖ్ -కాజోల్ మధ్య ప్యార్, అందుకు తగ్గట్లు యూరోప్ లో తెరకెక్కించిన పాటలు అబ్బో ఆ చిత్రం చూస్తుంటే ఇప్పటికీ మురిసిపోతుంటాం. ముంబైలోని మరాఠా మందిర్ లో ఇప్పటికీ డీడీఎల్ జే తన హవాను నిరాటకంగా కొనసాగిస్తూనే ఉంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. సినిమా అంటే సినిమాది కాదు... ఆ సినిమాలోని ‘తూజే దేకా తో హై జానా సనమ్...’ పాట గుర్తుంది కదా. ఈ ఆల్ టైం హిట్ కు సంబంధించి... బంజారా స్కూల్ ఆఫ్ డాన్స్ కు చెందిన మెహర్ మాలిక్ మరియు ఆయన భాగస్వామి ఈ పాటకు వేసిన స్టెప్పులు ఇప్పుడు హాట్ గా చూసేస్తున్నారు. మాములు డాన్సులు అయితే మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఇందులో ఓ ప్రత్యేకత ఉంది.

పాటకు లయబద్ధంగా వీరు బెల్లి డాన్సులు చేశారు. పాట లిరిక్స్ కు అవి సరిగ్గా సరిపోయాయి కూడా. కొద్దిరోజుల క్రితం నెట్ లో పెట్టిన ఈ సాంగ్ ను ప్రస్తుతం యూట్యూబ్ లో 94 వేల మంది దాకా వీక్షించారు. మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇక ఇప్పుడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Belly dance  DDLJ  Maher Malik  sharukh khan  

Other Articles