బాలయ్య శాతకర్ణి అప్పుడే క్లైమాక్సా? | Gautamiputra Satakarni climax shoot in Georgia

Gautamiputra satakarni climax shoot in georgia

Gautamiputra Satakarni climax, Balayya in Georgia, Krish in Georgia, Climax in Georgia

బాలయ్య శాతకర్ణి అప్పుడే క్లైమాక్సా? | Gautamiputra Satakarni climax shoot in Georgia

బాలయ్య శాతకర్ణి అప్పుడే క్లైమాక్సా?

Posted: 07/02/2016 05:24 PM IST
Gautamiputra satakarni climax shoot in georgia

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాలయ్య వందో చిత్రంపై ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో... అంతే వేగం చూపిస్తున్నాడు దర్శకుడు క్రిష్. త్వరగతిన సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసి భారీ హిట్ అందించడంతోపాటు, పెళ్లి చేసుకుని తాను ఓ ఇంటివాడినైపోవచ్చనే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే విదేశాల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న గౌతమీపుత్ర శాతకర్ణిని మూడో షెడ్యూల్ జూలై 4 నుంచి మొదలు కాబోతుంది.

జార్జియాలో జరగనున్న ఈ షెడ్యూల్ లో మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద క్లైమాక్స్ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారంట. ఇందులో శాతావాహనులకు-గ్రీకు సైనికులకు మధ్య యుద్ధాన్ని చూపించబోతున్నారు. ఈ విషయంపై నిర్మాతలు ఓ ప్రెస్ నోట్ అధికారికంగా కూడా విడుదల చేశారు. వెయ్యి మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో భారీగా ఇది ఉండబోతుందని తెలుస్తోంది. ఈ యుద్ధ సన్నివేశం కోసం రేపో, మాపో బాలయ్య కూడా జార్జియా బయలుదేరనున్నారంట. కాగా, ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ లో మొరాకోలో చిత్రీకరించిన వార్ ఎపిసోడ్ ఇంటర్వెల్ సీన్ అని సమాచారం.

విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్నాక తిరిగొచ్చాక మరో షెడ్యూల్ లో మిగతా షూటింగ్ అంతా పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ల ద్వారానే రెండు నెలలో షూటింగ్ మొత్తం అవగొట్టేయాలనే ఆలోచనలో ఉన్నాడంట. ఇక ఆపై మిగిలేది గ్రాఫిక్స్ వర్కే కావటంతో తీరిగ్గా ఆ వర్క్ కానిచ్చేసి సంక్రాంతికి సినిమాను తెచ్చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి భారీ చిత్రం అయినప్పటికీ మిగతా దర్శకుల్లాగా ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా చాలా కూల్ గా పని చేసుకుపోతున్నాడు జాగర్ల మూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Balakrishna  100 movie  Balayya  georgia  

Other Articles