పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా సంవత్సరాలు ఫ్లాప్ సినిమాలు ఎదురైనప్పటికీ, గబ్బర్ సింగ్ అంటూ తన విశ్వరూపాన్ని చూపించాడు పవన్. అయితే, దానికి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ నిరాశపరిచినప్పటికీ, ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో చేయబోతున్న ఫ్యాక్షన్ లవ్ స్టోరీతో అభిమానులకు పసైందన యాక్షన్ విందుని పంచనున్నాడు.
ఈ సినిమాకోసం కోరమీసంతో స్పెషల్ లుక్ తో కనపడుతున్నాడు మన పవర్ స్టార్. ఇటీవలే లండన్ లో జరిగిన తెలుగు అసోసియేషన్ ఆరవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ ‘కళ అనేది సంస్కృతిలో అంతర్భాగం, మన భాష, యాసని మర్చిపోకూడదని అన్నారు. తెలుగు జాతి కళలను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని కొనియాడాడు.
తన సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, తెలుగు ప్రాంతాల జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, అవసరమైతే మల్టీ స్టారర్ కూడ చేస్తానని తన సినిమాల ద్వారా మరింత ఎంటర్ టైన్మెంట్ పంచేలా చూస్తానని చెప్పాడు.
కోలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దుమ్మలేపుతున్న అజిత్ తో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నాడు. అంటే మనం అతి త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా చూడొచ్చన్నమాట. పవన్ అన్న ఈ మాటలు విని ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, మరి దానికి డైరెక్టర్ ఎవరో అని ఇప్పటినుంచే ఫిలిం నగర్ లో టాక్ మొదలైపోయింది.
నిజానికి పవన్ కళ్యాణ్ తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాని మొదట్లో రీమేక్ చేద్దామనుకున్నాడు. ఆ సినిమాలో అజిత్ పెర్ఫామెన్స్ కి ఫ్లాట్ అయ్యిపోయాడట పవన్ కళ్యాణ్. అందుకే , ఆ సినిమాని రీమేక్ చేసేందుకు సినిమా హక్కులను సైతం దక్కించుకున్నాడు. అందుకోసం ఎస్ జె సూర్యని దర్శకత్వం వహించమని కూడ కోరాడు. అయితే, ఎస్ జె సూర్య ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోవడంతో పవన్ తో సినిమా చేయలేక తప్పుకున్నాడు. దీంతో డైరెక్టర్ ని మార్చాల్సివచ్చింది.
అయితే కథ మాత్రం మారలేదని, అజిత్ నటించిన తమిళ ‘వేదాళం’ సినిమానే భారీగా మార్పులు , చేర్పులు చేసి డాలీ చేస్తున్నట్లుగా చెప్తున్నారు అందరూ. మరో టాక్ ఏంటంటే, ఎస్ జె సూర్య చెప్పిన కథనే డాలీ తీస్తున్నాడని , ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు.
దీనికి భిన్నంగా కోలీవుడ్ లో మరో టాక్ వినిపిస్తోంది. ఇటీవల బాహుబలి లాంటి భారీ సినిమా తీస్తానని సుందర్ సి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి తీయబోయే సినిమా అదేనని అంటున్నారు తమిళ తంబీలు.
ఏది ఏమైనా, పవర్ స్టార్ సినిమాపై ఈసారి అభిమానులు అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వీరందరినీ డాలీ ఎలా సాటిస్ఫై చేస్తాడో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more