ఏడాదిపాటుగా హాలీవుడ్ లో బిజీ అయిపోయిన సొట్టబుగ్గల సుందరి దీపికా బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ సంవత్సరం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమె నటించిన హిందీ చిత్రం లేదు. పైగా కొత్త వాటికి సైన్ కూడా చేయలేదు. దీంతో ఆమె దూరం అయిపోతుందని బాలీవుడ్ అంతా బెంగపెట్టుకుంది. కానీ, ఆమె ఓ చిత్రానికి ఓకే చెప్పిందన్న వార్త ఫ్యాన్స్ లో ఆనందం నింపుతోంది.
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో పద్మావతి అనే మరో భారీ బడ్జెట్ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కబోతుంది. ఈ చిత్రం కోసం తొలుత దీపికను అనుకున్నప్పటికీ హాలీవుడ్ బిజీలో ఆమె డ్రాప్ అయిందని, ఆ స్థానంలో ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ సినిమా ముగింపు దశకు చేరుకోవటంతో పద్మావతిగా తిరిగి ఆమె నటించబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు శ్రేయాస్ పురానీక్ తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని, ఇందుకోసం దీపిక అంగీకరించినట్లు ఆయన తెలిపాడు. అంతేకాదు ఈ చిత్రానికి తానే సంగీత దర్శకుడిని అని కూడ శ్రేయాస్ చెప్పుకోచ్చాడు. కాగా, ఇందులో దీపిక రొమాన్స్ చేయబోయేది ఎవరితోనో తెలుసా? ఇంకెవరకు ఆమె ప్రియుడు రణ్ వీర్ సింగ్. ఇప్పటికే సంజయ్ లీలా బన్సాలీ, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గోలియోంక రామ్ లీల, బాజీరావ్ మస్తానీలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైపోతుందన్న మాట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more