తమిళ్ రీమేక్ లో తెలుగు యాంకర్ హీరో | Praddep machiraju debut as hero with Mundasupatti remake

Anchor praddep as debut hero with mundasupatti remake

Pradeep machiraju as hero, telugu anchor hero in tamil remake, Mundasupatti remake Pradeep

Popular telugu anchor Praddep Machiraju debut as hero with Mundasupatti remake.

తమిళ్ రీమేక్ లో తెలుగు యాంకర్ హీరో

Posted: 07/11/2016 04:40 PM IST
Anchor praddep as debut hero with mundasupatti remake

ఈ మధ్య యాంకర్లంతా సినిమాలపై పడిపోతున్నారు. అందం, అభినయం ఉంటే చాలూ పెళ్లయిన సరే సిల్వర్ స్క్రీన్ ను ఏలేస్తున్నారు. ఇప్పటిదాకా లేడీ యాంకర్లకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు మగాళ్లకు కూడా పాకింది. గతంలో కొంతమంది యాంకర్లుగానే ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే వారు స్థిరపడిపోయారు. కానీ, ఫస్ట్ టైం ఓ యాంకర్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటించేందుకు సిద్ధమైపోతున్నాడు.

ప్రదీప్ మాచిరాజు టీవీ షోలు బాగా చూసేవారికి ఈ పేరు పరిచయం అక్కర్లేదు. గడసరి అత్త సొగసరి కొడలు లాంటి రియాలిటీ షో తో పిచ్చ పాపులారిటీ సంపాదించుకున్న ప్రదీప్ ఆ తర్వాత తానే నిర్మాతగా మారి కొంచెం టచ్ లో ఉంటే చెబుతా... చేస్తున్నాడు. టీఆర్పీ లో ఆ షోకి టాప్ పొజిషన్ లో ఉండటానికి కారణం ప్రదీప్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ప్రదీప్ త్వరలో హీరోగా ఆరంగ్రేటం చేయబోతున్నాడు.

రెండేళ్ల క్రితం తమిళ్ లో వచ్చిన కామెడీ చిత్రం ముందాసు పట్టి రీమేక్ లో ప్రదీప్ హీరోగా నటించబోతున్నాడు. విలేజ్ బ్యాగ్రౌండ్ లో ఉండబోయే ఈ చిత్రం ప్రదీప్ గెటప్ పూర్తి డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారం. నిజానికి ప్రదీప్ కి సినిమాలు కొత్తేం కాదు. అత్తారింటికి దారేదిలో కాసేపు అలరించడంతోపాటు, గతేడాది వచ్చిన భమ్ భోలే నాథ్ సినిమాలో డ్రగ్ అడిక్టెడ్ పాత్రలో మెప్పించాడు కూడా.  ముందుగా ఈ రీమేక్ ను సుధీర్ బాబుతో చేద్దామని అనుకున్నప్పటికీ అది వీలుకాకపోవటంతో ఇలా ప్రదీప్ తో తీస్తున్నారంట. మరి మనోడి వేషాలకు ఇది ఏ మాత్రం సూటవుతుందో చూడాలి.

భాస్కర్  


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu anchor  Pradeep machiraju  tamil remake  Mundasupatti  

Other Articles