maheshbabu and murugadas movie ready for shoot

Maheshbabu and murugadas movie ready for shoot

maheshbabu songs, maheshbabu next movie, maheshbabu murugadas movie, maheshbabu voskodigama, maheshbabu harris jayraj

prince maheshbabu and murugadas film is ready for shoot in few days. the shoot start with song which composed by harrish jayraj music director of this film

పాటతోనే స్టార్ట్ చేస్తున్నాడు...!!

Posted: 07/12/2016 12:58 PM IST
Maheshbabu and murugadas movie ready for shoot

మహేష్ బాబు మురుగదాస్ క్రేజీ కాంబో సినిమా స్టార్ట్ కాబోతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అందుకోసం మురుగదాస్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ తో ఒక టైటిల్ సాంగ్ ని చేయించాడట. ఈ సాంగ్ తమిళంలో ఆల్రెడీ లిరిక్స్ కూడ రాసేసారని, ఇప్పుడు తెలుగులో ఆ లిరిక్స్ ని కరెక్ట్ గా రెడీ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు మురుగదాస్. దీనికి సంబంధించిన కామెడీ ట్రాక్స్ తీసేందుకు అటు తమిళ ఆర్టిస్టులను, ఇటు తెలుగు ఆర్టిస్టులను మిక్స్ చేస్తున్నాడట. అంతేకాకుండా బాలీవుడ్ లో మరుగదాస్ కి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాని హిందీలో కూడ డబ్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో పరిచయ గీతాన్ని సిద్ధం చేసిందట చిత్రయూనిట్. ఈ సాంగ్ తోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవతుందని చెప్తున్నారు అందరూ.

ఈ సినిమాకి వాస్కోడిగామా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇటీవలే సినిమాలో హీరోయిన్ పరిణీతిచోప్రాకి బదులుగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles