కమల్ కోసం స్పెషల్ షోను వాయిదా వేసిన రజనీ | Rajinikanth won't allow special screenings of Kabali for Kamal

Rajinikanth won t allow special screenings of kabali for kamal

Rajanikanth special screening pf kabali, Kabali special screening, Kamal Kabali special show, Kabali special show cancelled, kamal hassan reason for Kabali, kabali for Kamal

Rajinikanth won't allow special screenings of Kabali for Kamal

కమల్ కోసం కబాలి వాయిదా?

Posted: 07/20/2016 09:34 AM IST
Rajinikanth won t allow special screenings of kabali for kamal

సూపర్ స్టార్ రజనీకి లోకనాయకుడు కమల్ హసన్ ఇద్దరు దాదాపు ఒకేసారి కెరీర్ ను ప్రారంభించారు. ఆ టైంలో ఒకరి సినిమాల్లో ఒకరు నటించారు కూడా. అయితే స్టార్లు గా ఎదిగాక ఫ్యాన్స్ కొట్టుకుంటారన్న భయంతోనే ఇద్దరు కలిసి నటించడం మానేశారు. ఈ విషయాన్ని చాలాసార్లు బహిరంగంగా చెప్పారు కూడా.

మిగతా ఇండస్ట్రీలో మాదిరిగా కాకుండా టాప్ హీరోలైనప్పటికీ అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతుంటారు. ఈవెంట్లు, సేవా కార్యక్రమాలు, కోలీవుడ్ నిర్వహించే కల్చరర్ ప్రోగ్రాంలు ఇలా అన్నింట్లో ముందుండేది ఈ ఇద్దరే. వారిద్దరి మధ్య ఎంతో ఆత్మీయత, అనుబంధం వున్నాయి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తుంటారు, ఒకరి సూచనలను మరొకరు పాటిస్తుంటారు.

ఇదిలా ఉండగా 'కబాలి' చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకి ముందే తన స్నేహితులకు .. సన్నిహితులకు స్పెషల్ షో వేసి చూపించాలని రజనీ అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆయన ఆ ఆలోచనని విరమించుకున్నారు. ప్రస్తుతం కాలుకు పాక్చర్ అయి కమల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉన్న సంగతి తెలిసిందే. కమల్ రాకుండా .. ఆయన లేకుండా 'కబాలి' స్పెషల్ షో చూడటం ఇష్టం లేకనే రజనీ రద్దు చేయించాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajanikanth  Kabali  special show  Kamal hassan  injure  

Other Articles