క్యాంపస్ అంపశయ్య సినిమాలో నగ్న సన్నివేశాలు | Campus ampasayya movie contained bold scenes

Campus ampasayya movie contained bold scenes

telugu movie, ampasayya movie, pavani bold in ampasayya, Naveen Ampasayya movie, pavani nude in ampasayya, ampasayya bold scenes, campus ampasayya, pavani bold in campus ampasayya, nude scenes in campus ampasayya, nude scenes in telugu movie

telugu movie campus ampasayya contains bold scenes.

మన సినిమాలో నగ్న సన్నివేశాలా???

Posted: 07/25/2016 05:23 PM IST
Campus ampasayya movie contained bold scenes

బోల్డ్ సన్నివేశాలు కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ కే పరిమితమైన ఈ పేరు తర్వాత మెల్లిగా సౌత్ లోనూ పాకింది. ఎక్కువ శాతం ఆర్ట్ చిత్రాలకే పరిమితమైన నగ్న దృశ్యాలు తెలుగులో అసలు కనిపించిన దాఖలాలు లేవు. కానీ, త్వరలో ఓ టాలీవుడ్ సినిమాలో పూర్తి స్థాయి బోల్డ్ సన్నివేశాలను చూపించబోతున్నారంట.  
 
ప్రభాకర్ జైని అనే దర్శకుడు తెరకెక్కించిన క్యాంపస్ అంపశయ్య చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం కాబోతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో పూర్తి స్థాయి నగ్న సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. గ్రామీణ ప్రాంతంలో తెరకెక్కిన ఈ చిత్రం లో శ్యామ్ కుమార్, పావనీ జంటగా నటించారు. నవల కథలో భాగంగా ప్రధాన తారగణంతోపాటు, మరి కొన్ని పాత్రల మధ్య శృంగార సన్నివేశాలు ఉంటాయంట. నవలను చెడగొట్టే ఉద్దేశం లేకపోవటంతో దర్శకుడు ఆ నగ్న సన్నివేశాలను దర్శకుడు ప్రభాకర్ యథాతథంగా చిత్రీకరించాడంట.

కథానుగుణంగా సహజత్వం కోసమే ఆ సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చిందని. ఎక్కడా వల్గారిటీ ఉండదని దర్శకుడు చెబుతున్నాడు. అయితే గతంలో మంచి మంచి ఆర్ట్‌ ఫిల్మ్‌ అందించిన ఈ దర్శకుడికి జాతీయ స్థాయిలోనూ పేరు ఉంది.  వ్యాపారాత్మక దృక్పథంతో, కమర్షియల్‌ ఫార్మాట్‌తోకాకుండా కేవలం ఆలోచనాత్మక ధోరణితోనే ఈ సినిమాను తీస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఈ  న్యూడ్ సీన్ల ట్రీట్ కు సెన్సార్ ఎలా ఓకే చెబుతుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ampasayya  bold scenes  pavani  prabhakar jainy  

Other Articles