విశాల్ ఒక్కడొచ్చాడులో జగపతి బాబు | Okadocchadu title for vishal tamanna movie

Okadocchadu title for vishal tamanna movie

vishal tamanna movie, jagapathi babu in vishal movie, jagapathi babu and vishal, jagapathi babu in okadocchadu, okadocchadu movie

Vishal next movie title fixed as Okadochadu. Tamanna heroine and suraj direction.

విశాల్ ను ఢీకోట్టబోయేది ఎవరంటే...

Posted: 07/25/2016 06:44 PM IST
Okadocchadu title for vishal tamanna movie

ఒకప్పుడు తెలుగులోనూ తన హవా చాటిన తమిళ హీరో విశాల్ రాయుడితో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గత చిత్రాల మాదిరిగానే తిరిగి తన మార్కెట్ పుంజుకోవటంతో ఇకపై రెండు భాషల్లో ఒకేసారి చిత్రాలను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు హీరో సూర్య లాగే తెలుగులోనూ తన చిత్రాలను భారీగా ప్రమోట్ చేయాలని నిర్మాతలకు సూచిస్తున్నాడు.  ప్రస్తుతం సురాజ్ అనే కొత్త దర్శకుడి డైరక్షన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుంది. దీనికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.  

విశాల్ సరసన తమన్నా జంటగా ఈ సినిమా రూపొందుతోంది. కొంత కాలం క్రితం సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తమిళ వెర్షన్ కి 'కత్తి సందై' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక తాజాగా తెలుగు టైటిల్ గా 'ఒకడొచ్చాడు' ను ఫిక్స్ చేయాలని విశాల్ అనుకుంటున్నారట.

కథాపరంగా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని విశాల్ భావిస్తున్నాడని అంటున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మ్యాన్లీ స్టార్ జగపతిబాబు విలన్ పాత్ర పోషించబోతున్నాడు. ఇందులో విశాల్-జగపతి బాబు మధ్య పోరాట సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishal  tamanna  jagapathi babu  okadocchadu  suraj  

Other Articles