ఆత్మకథలో సన్నీలియోన్ నటించబోతుంది | Sunny Leone to star in her own biopic

Sunny leone to star in her own biopic

sunny leone auto biography, sunny leone bio pic, sunny leone porn life, sunny leone with husband daniel weber

Sunny Leone to star in her own biopic made by Tere Bin Laden director.

ఆమె సినిమా ఖచ్ఛితంగా సంచలనమే!

Posted: 07/27/2016 10:56 AM IST
Sunny leone to star in her own biopic

బయోపిక్ (జీవిత కథలు) లకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే తాము అభిమానించే వ్యక్తుల జీవితంలో జరిగే వ్యక్తిగత వివరాలను తెలుసుకోవాలనే కుతుహలం ప్రతీ ఒక్కరికీ ఉండటమే. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవటానికి నిర్మాతలు, వాటితో బాగా పాపులర్ అయిపోదామని హీరోహీరోయిన్లు ప్రయత్నిస్తుంటారు.

అయితే ఇప్పటిదాకా వచ్చిన బయోపిక్ లు ఒక ఎత్తయితే త్వరలో బాలీవుడ్ లో రాబోతున్న మరో ఆత్మకథ మరో ఎత్తు. శృంగార తార సన్నీ లియోన్ బయోపిక్ ను కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ కు రాకముందు పూర్వాశ్రమంలో సన్నీలియోన్ ఏం చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఆమె బయోపిక్ లో ఏం చూపించబోతున్నారా? అన్న ఆసక్తి నెలకొనటం సహజం.

ప్రముఖ ఫిలిం మేకర్ అభిషేక్ వర్మ నిర్మించబోతున్న ఈ చిత్ర విశేషం ఏమిటంటే, ఇందులో సన్నీ పాత్రను ఆమె చేతే వేయించడానికి చూస్తున్నారంట. అలాగే, ఆమె భర్త  డేనియల్ వెబర్ కూడా ఇందులో నటించబోతున్నాడని సమాచారం . నీలిచిత్రాలు, సంచలనాలతో నిండిన ఆమె బయోపిక్ వస్తుందన్న వార్తలతో బాలీవుడ్ లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  auto bio graphy  daniel weber  abhishek varma  

Other Articles