తెలుగులో ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ గా ఉన్నది ఏంటంటే... జనతా గ్యారేజ్ అనే చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ పైగా మోహన్ లాల్ కీలక పాత్ర కావటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే... ఈ చిత్ర క్లైమాక్స్ కోసం ఇప్పటిదాకా ఏ తెలుగు చిత్రం కోసం చేయని పని చేస్తున్నారని తెలుస్తోంది.
జనతా గ్యారేజ్ కోసం దర్శకుడు కొరటాల రెండు క్లైమాక్స్ లను ఫ్లాన్ చేస్తున్నాడంట. అందులో ఒకటి తెలుగు వర్షన్ కి సంబంధించింది కాగా, మరోకటి మళయాళం వర్షన్ కోసం... మొన్నామధ్యే విడుదలైన టీజర్ ఇక్కడా, అక్కడా వేర్వేరు వర్షన్ లుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు క్లైమాక్స్ లను కూడా వేర్వేరుగా షూట్ చేయాలని అనుకుంటున్నాడంట. అయితే దీనివెనుక నటుడు మోహన్ లాల్ ప్రమేయం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
మళయాళం వర్షన్ హక్కులను మోహన్ లాల్ సొంతం చేసుకుని, అక్కడ భారీ రేటుకు అమ్ముకున్నాడు. దీంతో మోహన్ లాల్ దగ్గరుండి మరీ ఈ సినిమాపై ప్రత్యేక శ్రధ్ద కనబరుస్తున్నాడు. ఆయనతోపాటు, మళయాళంలో క్రేజ్ ఉన్న మరో నటుడు ఉన్నిముకుంద్ కూడా ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మాలీవుడ్ ప్రేక్షకులను సంతృప్తిపరిచేలా క్లైమాక్స్ మార్చాలని కొరటాలపై కాస్త ఒత్తిడి తెచ్చాడంట. దీంతో ఈ చిత్రానికి రెండు ముగింపులు ఉండేలా ఫ్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ కబాలి విషయంలో కూడా ఇలాగే రెండు క్లైమాక్స్ లు గా మార్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర రజనీని చంపినట్లు చూపించగా, మలేషియా వర్షన్ క్లైమాక్స్ లో మాత్రం అక్కడి పోలీసు మనోభావాలు దెబ్బతీయకుండా కేవలం అరెస్ట్ చేసినట్లు మాత్రమే చూపారంట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more