వరుణ్ సందేశ్ పెళ్లి డేట్, వేదిక ఫిక్స్ | varun sandesh wedding date and venue fix

Varun sandesh wedding date and venue fix

varun sandesh wedding, varun sandesh and Vithika Sheru, varun and vithika, varun and vithika marriage, Varun Sandesh Marriage, Varun Sandesh wife, Actress Vithika husband, varun sandesh marriage, hero Varun sandesh marriage

varun sandesh and Vithika Sheru wedding date and venue fix.

టాలీవుడ్ ప్రేమ జంట పెళ్లి డేట్ ఫిక్స్

Posted: 08/08/2016 02:01 PM IST
Varun sandesh wedding date and venue fix

సినిమాల్లో హీరోలు హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎంతదాకా నడిచినా పెళ్లి పీటలు ఎక్కేవి చాలా కొన్ని అంటే కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ యంగ్ కపుల్  త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానుంది.

వరుణ్ సందేశ్ నటి వితిక షేరూలు లవ్ కహానీతోపాటు ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ మొదట్లో ఊపులో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ కుర్రహీరో కొన్నేళ్లుగా హిట్ అనే పదం రుచిచూడలేకపోయాడు. మధ్యలో మల్టీస్టారర్ చిత్రాలంటూ హడావుడి చేసిన అది ఏ మాత్రం అతనికి ఉపయోగపడలేదు. డజను పైగా ఫ్లాపులు ఉన్నా సరే ఆఫర్లు మాత్రం అతన్ని వెతుకుంటూ వస్తున్నాయి. అతని ఫ్లాప్ సినిమాల లిస్ట్ లో ఒకటైన పడ్డానండీ ప్రేమలో మరి అనే చిత్ర హీరోయిన్ వితిక షేరుతో నిజంగానే లవ్ ట్రాక్ నడిపిన వరుణ్ ఇరువైపు పెద్దలను పెళ్ళికి ఒప్పిగించగలిగాడు.

ఆ మధ్య ఘనంగా ఎంగేజ్ మెంట్ కాగా, ఇప్పుడు పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఆగష్టు 18న శామీర్ పేట సమీపంలోని అలంకృత రిసార్ట్ లో జరగనుందట. ఈ విషయాన్ని వెడ్డింగ్ కార్డు ద్వారా మీడియాకు తెలియజేశారు వరుణ్ పేరెంట్స్. ఈ మధ్య బ్యాచిలర్ లైఫ్ కు చాలా మంది హీరోలు ముగింపు చెబుతున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడీ యంగ్ హీరో కూడా జాయిన్ అవుతున్నాడు. మరి పెళ్లయ్యాకైనా మనోడికి కలిసోస్తుందంటారా? చూద్దాం.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun sandesh  vithika Singh  wedding  venue  

Other Articles