తనయుల ప్రేమ పెళ్లిళ్లపై అక్కినేని నాగార్జున | akkineni nagarjuna officially respond on son's marriage

Akkineni nagarjuna officially respond on sons marriage

Nagarjuna on sons marriage, nag on marriages, Nagarjuna officially confirmed, nagachaitanya samantha marriage, samantha marriage officially confirmed

Akkineni Nagarjuna officially respond on sons marriage.

అక్కినేని పెళ్లిళ్లపై అఫీషియల్ న్యూస్

Posted: 08/08/2016 03:57 PM IST
Akkineni nagarjuna officially respond on sons marriage

ఆ మధ్య పిల్లల పెళ్లిళ్ల విషయంలో ఎలాంటి అడ్డుచెప్పటం లేదంటూ నాగ్ ప్రకటన ఇచ్చాడన్న వార్త సుద్ద అబద్ధమట. ఈ విషయాన్నే స్వయంగా ఆయనే చెబుతున్నాడు. సమంత-చైతూ పెళ్లిళ్లకు నాగ్ విలన్ గా మారాడు. వారిద్దరి పెళ్లికి అడ్డుతగులుతున్నాడు, అందుకే రోజులు గడుస్తున్నా ఈ విషయంలో ఏ మాత్రం స్పషత లేదు అంటూ కొన్ని పత్రికలు వార్తలు రాసేశాయి పత్రికలు. దీంతో మీడియాతో ఇంటరాక్ట్ అయిన నాగ్ ఈ వ్యవహారంలో అధికారికంగా ఓ స్పష్టత ఇచ్చాడు.

తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు అనుకున్న వారితోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే, ఇద్దరి వివాహాలు ఒకేసారి జరుగుతాయన్న వార్తల్లో మాత్రం వాస్తవం లేదని చెప్పారు. "అవును, చైతూ, అఖిల్ లు తమ జీవిత భాగస్వాములను తామే ఎంచుకున్నారు. అలాగే కెరీర్ పరంగా కూడా ఎవరి దారిలో వాళ్లు వెళుతున్నారు. ఇక వాళ్ల పెళ్లిళ్లు అంటారా ... జాయింట్ వెడ్డింగ్ అస్సలు నిర్వహించం . వాళ్ల ఇద్దరి వివాహాలను అలా ఒకేసారి ఎంజాయ్ చేయాలని నాకు లేదు అన్నాడు.

వాళ్ల ఇష్టం, వాళ్లదే నిర్ణయం. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో నేను జోక్యం చేసుకోను. కెరీర్ పరంగా ఏదైనా గైడెన్స్ కావాలంటే మాత్రం ఇస్తాను తప్ప లైఫ్ కి సంబంధించిన వాటిల్లో అస్సలు జోక్యం చేసుకోను" అని చెప్పారు నాగార్జున. కానీ, వివాహాలకు ఇంకా ముహుర్తాలేం ఖరారు చేయలేదని, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని తెలిపాడు. దీంతో అక్కినేని వారసుల లవ్ మ్యారేజ్ లపై నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయినట్లయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna akkineni  chaithu  samantha  akhil  marriages  date  venue  

Other Articles