ఒక సినిమా వచ్చి ఇలా హిటవుతుందో లేదో అలా కొత్త సినిమాను ఓకే చేసి మొదలెట్టేయటం, అది సెట్ మీద ఉండగానే, ఇంకో సినిమాను రిలీజ్ చేయటం, ఆ సినిమా కూడా షూటింగ్ లో ఉండగానే ఇంతకు ముందు చెప్పుకున్న సినిమా వచ్చేయటం కాస్త కన్ఫ్యూజ్ గా ఉంది కదా. ప్రస్తుతం నాని చేస్తున్న పని ఇదే. ఏ క్షణాన హిట్టు కొట్టడం ప్రారంభించాడోగానీ, ఒకదాని వెంట మరోకటి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
ప్రస్తుతం నేను లోకల్ షూటింగ్ మొన్నే ప్రారంభించగా, మజ్ను ముగింపు దశకు చేరకుంది. ఆ మధ్యే మజ్ను ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ఈరోజు టీజర్ రిలీజ్ చేసేశారు. ఇక టీజర్ లో నాని ఎప్పటిలాగే ఎక్స్ ప్రెషన్ తో కుమ్మేశాడు. ఇళయరాజా సాడ్ సాంగ్స్ తీసుకుని, ట్రెయిన్ లో కూర్చుని అభినందన సినిమాలోని ప్రేమ లేదని ప్రేమించరాదని... అంటూ పాట ప్లే అవుతుంటే, ఇటు మరో యాంగిల్ లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ను చూపిస్తూ, ఇంకోవైపు మనోడు బాధగా మెడలో కండువా వేసుకుంటూ... చివర్లో గుర్రపు రథంపై నాని దూసుకెళ్తుంటే స్టార్ట్ లవింగ్ అని తెరపై పడుతుంది.
ప్రేమలో ఫెలయితే ఇంకా ఎక్కువ ప్రేమించాలని బహుశా నాని ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్నాడేమో! ఆ సంగతి పక్కనబెడితే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గురించే నిద్రమొహం లా ఉందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తారు. మరి యాక్టింగ్ లో ఏం చేస్తుందో చూడాలి. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా, చిత్రం సెప్టెంబర్ 17న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more