డూప్ లు లేకుండానే యాక్షన్ సీన్లు | Chiranjeevi in action mode for 150th movie

Ram laxman compose fights for chiru 150

Chiru no dupes for 150, Chiru 150 fights, Chiru 150 interval scene, ram laxman compose fights for Chiru 150, Chiru action scenes for 150

ram laxman compose fights for Chiru 150. Chiru No Dupes for !50.

యాక్షన్ దమ్ము ఏ మాత్రం తగ్గలేదా?

Posted: 08/20/2016 10:04 AM IST
Ram laxman compose fights for chiru 150

రీఎంట్రీ కి ఏడాది ముందు నుంచే ఫిట్ నెట్ పై ప్రత్యేక దృష్టిసారించిన చిరు, డాన్సులు, ఫైట్లలో మునుపటి గ్లో కనబడేలా చాలా కష్టపడ్డాడు. లుక్ పరంగా పాత సినిమాల్లో మెగాస్టార్ గుర్తుకు వచ్చేలా మారిపోయాడు. ఇక షూటింగ్ మొదలయ్యాక ఏ మాత్రం రెస్ట్ ఇవ్వకుండా పాల్గొంటూనే ఉన్నాడు. యాక్షన్ సీన్లలో చిరులో ఏ మాత్రం పసతగ్గలేదంటున్నారు స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ లు.
 
ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కొంతమంది రౌడీలతో చిరు తలపడే సన్నివేశాలను దర్శకుడు వినాయక్ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడు. మాతృక లో ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ ఫైట్ అక్కడ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక తెలుగులోనూ అదే ఊపును వినాయక్ కొనసాగిస్తున్నాడంట. పైగా డూప్ లు అక్కర్లేదంటూ చిరు ఉత్సాహంగా అందులో పాల్గొంటున్నాడని స్టంట్ ద్వయం చెబుతున్నారు.

ఈ ఫైట్ తెలుగులోనూ హైలెట్ కానున్న నేపథ్యంలో ఒక రేంజ్ లో ఉండేలా రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేశారంట. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్లు , చిరు తనయుడు, నిర్మాత రాంచరణ్ ప్రకటించాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ వరుసగా ఉండటంతో సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు కొణిదెల వారబ్బాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150  Action scenes  ram laxman fights  

Other Articles