హీరోయిన్ గా ఇండియా వైడ్ మొత్తం అన్ని భాషల్లో రెస్ట్ లేకుండా దుమ్ము దులిపిన శ్రీదేవీ, సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం మందగించింది. ఇంగ్లీష్ వింగ్లీష్ కాస్త ఊరట కలిగించిన, విజయ్ పులి మాత్రం దారుణమైన దెబ్బ వేసింది. అందులో ఆమె వేషం, క్యారెక్టర్ చూసి జడుసుకున్న జనాలు అతిలోక సుందరికి సినిమాలు ఎంపిక చేసుకోవటం కూడా రాదా అంటూ సెటైర్లు వేశారు. దీంతో ఆచీ తూచీ సెలక్ట్ చేసుకుంటుంది.
ప్రస్తుతం భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న మామ్ చిత్రంలో నటిస్తోంది. సవతి తల్లి, కూతురుల మధ్య అన్యోన్య బంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇంతలో ఆమె మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతుందన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్ తదుపరి చిత్రంలో శ్రీదేవీ నటించబోతుందట. అది కూడా కండల వీరుడి తల్లి పాత్రలో అని సమాచారం అందుతోంది. రచయిత విపుల్ షా వినిపించిన కథ నచ్చడంతో, సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇది తల్లీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టే కథాంశంతో రూపొందే సినిమా. ఇందులో తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో, శ్రీదేవి అయితేనే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారు. అన్నట్లు గతంలో చంద్రముఖి, చాంద్ కా తుక్ డా చిత్రంలో ఇద్దరు హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డా, బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రాలు బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ తల్లిగా నటించేందుకు ఆమె నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో వేచి చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more