ఆరు పదులకు అతి చేరువలో ఉన్నా ఈ కింగ్ ఇంకా నవ మన్మధుడే. అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా తెరంగ్రేటం చేసి దాదాపు 30 ఏళ్ల కెరీర్ దాటి ఇంకా ఫుల్ జోష్ తో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగ్ కెరీర్‌కి నో నీడ్ ఆఫ్ ఇంట్రో! నాగ్ స్టయిల్‌కి నో రిమార్క్! నాగ్ పర్సనాలిటీకి నో మ్యాచింగ్. ! 1959 ఆగష్టు 29న చెన్నైలో జన్మించిన ఈ అక్కినేని అందగాడు తండ్రి సుడిగుండాలు (1967) లో బాలనటుడిగా ఓ చిన్న రోల్ లో కనిపించాడు. ఆపై 1986లో విక్రమ్ ద్వారా పూర్తిస్థాయి హీరోగా తెరంగ్రేటం చేశాడు. మజ్ను, ఆఖరి పోరాటం, జానకీ రాముడు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును పొందాడు. అలా సాగుతున్న నాగ్ కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది మణిరత్నం గీతాంజలి(1989). ఆ దెబ్బకి లవర్ బాయ్ ఈమేజ్ నాగ్ సొంతం అయ్యింది. అది 15 ఏళ్ళపాటు అలా కొనసాగిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఆయన అమ్మాయిల మనసు దోచే సోగ్గాడే... అలా అని రొమాంటిక్ పాత్రలకే పరిమితం కాలేదు... భక్తి పారవశ్యంలో ముంచెత్తే వాగ్గేయకారుడయ్యాడు...(అన్నమయ్య), భక్తుడైపోయాడు (శ్రీరామదాసు), దేవుడయ్యాడు (షిర్డీసాయిబాబ), అన్యాయాన్ని ఎదిరించే విప్లవకారుడు రాజన్నగా మారాడు. అటు క్లాసునూ, మాస్ నూ అన్ని వయసుల వారినీ మెప్పించే విభిన్న చిత్రల్లో నటించాడు అక్కినేని నాగార్జున.
కొన్ని పాత్రల్లో చేస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందేమో నని వెనుకడుగు వేయకుండా సంచలనం సృష్టించాడు. ఈ వయసులోనూ నాగ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకోవటమే కాదు, తన తనయులతోసహా యువ హీరోలకు సవాల్ విసురుతూనే ఉన్నాడు. గగనం, రాజన్న, సొగ్గాడే చిన్నినాయనా, ఊపిరి... ఇవన్నీ ఆ కోవలోనివే. హుందాగా ఉండే పాత్రలతో అందుకే అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు అక్కినేని నాగార్జున. నటుడిగా తండ్రి నాగేశ్వర్ రావు ఇంపాక్ట్ కొంత ఉన్నప్పటికీ తన ఒరిజినాలిటీని కాపాడుకుంటూ కెరీర్ లో పైకెదిగాడు.
నాగేశ్వర్ రావు ఫామిలీ చిత్రల్లో నటించి మహిళల అభిమానాన్ని బాగా సంపాదించారు. అలా అని అవే పాత్రల్లో ఇమిడిపోకుండా డిఫరెంట్ రోల్స్ ఎంపిక చేసుకున్నారు. చక్రధారి, చాణక్య (చాణిక్య చంద్రగుప్తుడు), భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, కాళిదాసు వంటి వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. అలాగే నాగార్జున కూడా అమ్మాయిల మనసుదోచే మన్మధుడి నుంచి అన్నమయ్య, భక్తరామదాసు, శ్రీ షిర్డీ సాయిబాబ పాత్రల్లోకి దిగిపోయి సక్సెస్ అందుకున్నాడు. నటుడిగా తన కెరీర్ ను ఎంత బిల్డప్ చేసుకున్నాడో... ఎంటర్ ప్రెన్యూర్ గా నూ అదే స్థాయిలో పైకెదిగాడు. ప్రతిభావంతులైన కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఎంతో మందికి మంచి భవిష్యత్ అందిస్తున్నాడు.
నేడు(ఆగష్టు29న) అక్కినేని నాగార్జున 57వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకూ తన సినిమాల ఎంపికలో బిజీగా ఉన్న ఈ నటుడు ఇప్పుడు ఇద్దరు కుమారుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడున్న పోటీకి తగినట్టుగా వాళ్ళకు మంచి సలహాలిస్తూ... పెద్ద కుమారుడు నాగచైతన్యతో పాటు ఇప్పుడు అఖిల్ ను కూడా ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్నో సక్సెస్ లు అందుకున్న నాగార్జున ఇక ముందు కూడా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయనకు తెలుగు విశేష్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more