జనతా గ్యారేజ్ ఆసక్తి రేపుతున్న కథ, కాంబినేషన్ ఇలా ప్రతీ విషయంలో సినిమాపై అంచనాలు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో గ్యారేజ్ టీంలోనే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనూ ఇప్పుడు టెన్షన్ పెరిగిపోతుంది. అయితే తన విషయంలో మాత్రం లెక్క వేరుగా ఉంది అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. చిత్ర ప్రమోషన్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు శివ.
అక్కడి అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి
చిత్ర షూటింగ్ మొదలైన రోజు నుంచి ఈ క్షణం దాకా తను చాలా ఎగ్జయింగ్ తో ఉన్నానని, పరీక్ష రాసిన రిజల్ట్ కోసం ఎదురు చూసే పిల్లాడిలా తన పరిస్థితి ఉందన్నాడు. సినిమా ఎంత హిట్టవుతుందనే ఆలోచన కంటే.. ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి తనలో ఎక్కువ ఉందని చెబుతున్నాడు. ‘‘ఈ కథ గురించిన ఆలోచన రాగానే దీనికి కేవలం ఎన్టీఆర్ మాత్రమే సరిపోతాడని అనుకున్నా. స్క్రిప్టు విన్నప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరుతో ఇక పూర్తిగా ఫిక్సయిపోయాను. ఒక నటుడు ఓ కథ విషయంలో ఎంతగా ఎగ్జైట్ అవుతాడన్నది దర్శకుడికి చాలా ముఖ్యం. అదే టైంలో నన్ను ఎలా ఎగ్జైట్ చేయాలో కూడా ఎన్టీఆర్ కు చాలా బాగా తెలుసు. ప్రతి హీరోకూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అలాగే తారక్ కి కూడా ఉంది. ఎన్టీఆర్ ను ఇప్పటిదాకా ఎవరూ చూపించని విధంగా తాను చూపించాననే ధీమాతో ఉన్నట్లు కొరటాల చెప్పాడు.
ఇక మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ... తెలుగులో స్టార్లు లేనట్లు మళయాళం నుంచి ఆయన్ని దింపాల్సిన పరిస్థితి ఏంటని పలువురు నాపై విమర్శలు కురిపించారు. ఐతే కొన్ని పాత్రలకు కొందరు నటులై సూటవుతారని.. మోహన్ లాల్ చేసిన పాత్ర కూడా అలాంటిదే అని.. ఆయనే ఆ పాత్రకు కరెక్ట్ అని వివరించాడు. ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని నేను భావించాను. తెరమీద కూడా వారి జోడీ అలాగే కనిపించింది. అలాగని సినిమాకి అసలు హీరో కథ మాత్రమే. వారు ఆ కథను తన పాత్రలతో ఫీక్స్ లోకి తీసుకెళ్లారు అంటూ చెప్పుకొచ్చాడు. కొరటాల అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే సినిమా అవుట్ పుట్ ఏ స్థాయిలో వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. సో.. ఫ్యాన్స్ టికెట్ కౌంటర్ల దగ్గర వెయిటింగ్ చేసేందుకు సిద్ధమైపోండి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more