పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే ముహుర్తం అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పేశాడు అక్కినేని నాగార్జున. దీంతో కాబోయే కోడలు సమంత ఎంచక్కా మామగారి ఇంటికి చక్కర్లు కొట్టి వస్తోంది. మొన్నే అత్త అమలతో కాసేపు టైంపాస్ చేసినట్లు ఫోటోలు బయటికి వచ్చాయి. దీంతో ఈ అతిత్వరలోనే సమంతకు బ్యాండ్ మోగబోతుందని, అందుకే సినిమాలు ఒప్పుకోవట్లేదని చెప్పుకుంటున్నారు. అయితే ఆ మధ్య శివకార్తికేయన్ తో ఓ సినిమాకు సైన్ చేసిందని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు ఆ చిత్ర నిర్మాతలు. దీంతో శామ్ ఈజ్ బ్యాక్ అని అంతా అనుకున్నారు.
కానీ, ఆ వార్తను కూడా తుస్సుమనిపించింది సమంత. తాను ఇంతవరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదని ట్విట్టర్ లో తెలియజేసింది. అసలు పెళ్లి కారణంగానే సినిమాలు చేయట్లేదన్న వార్తలను పరోక్షంగా తోసిపుచ్చింది. 'దక్షిణాది సినీరంగంలో హీరోయిన్లుకు అర్థవంతమైన పాత్రలు దొరకటం ఎంత కష్టమో ఇప్పుడిప్పెడే అర్ధమవుతోంది. కేవలం మంచి పాత్రలు రాని కారణంగా ఇంత వరకు ఏ సినిమాను అంగకీరించలేదు. ఈ విషయం చెప్పటం నాకేంతో బాధ కలిగిస్తోంది.' అంటూ ట్వీట్ చేసింది.
అ..ఆ... తరహా పాత్రలు పడితేనే ఇకపై సినిమాలకు సంతకం చేస్తానని ఆ చిత్ర ప్రమోషన్ టైంలో చెప్పేసింది. నాలుగు నెలలుగా ఈ బ్యూటీ ఖాళీగా ఉండటంతో ఇక సినిమాలు చేయబోదని, జనతా గ్యారేజే తన లాస్ట్ సినిమా అని అంతా డిసైడ్ అయిపోయారు. అయితే జీవం ఉట్టిపడే పాత్రలతో వస్తే తాను రెడీ అంటూ ఇప్పుడు చెప్పేసింది. మరీ ఆ తరహా పాత్రలు ముందుంచి సమంతను ఒప్పించేంది ఎవరో మరి?
I haven't signed as many films as I d like too only and only because there are no good roles . As disheartening as it is to say .
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) September 17, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more