జియో వ్యవహారంలో షారూఖ్ కి షాక్ | Twitterati troll Shah Rukh Khan over Reliance Jio ad

Twitterati troll shah rukh khan over reliance jio ad

Twitterati troll Shah Rukh Khan Jio ad, #RemoveSRKFromJio, SRK Reliance Jio ad, Reliance Jio shock, Reliance Jio ambassador SRK

Twitterati troll Shah Rukh Khan over Reliance Jio ad.

షారూఖ్ దేశభక్తితో ఆ కంపెనీకి చిక్కులు

Posted: 09/17/2016 01:55 PM IST
Twitterati troll shah rukh khan over reliance jio ad

బాలీవుడ్ ‘బాద్షా’ షారూఖ్ ఖాన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రిలయన్స్ జియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జియో లాంఛ్ రోజున ముకేష్ ఫ్యామిలీతో కలిసి ఎంత హడావుడి చేశాడో తెలిసిందో. అయితే ప్రచార కార్యకర్తగా  షారూఖ్ ను వెంటనే తప్పించాలని వినియోగదారులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. లేదంటే జియో సిమ్‌లు తిరిగి ఇచ్చేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీనికి వారు కారణం కూడా చెబుతున్నారు.

షారూఖ్‌లో దేశభక్తి ఏమాత్రం లేదని, అటువంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన వంచకుడని, జాతి వ్యతిరేకి అని ట్విట్టర్‌లో విమర్శిస్తున్నారు. #RemoveSRKFromJio యాష్ ట్యాగ్ పేరుతో షారూఖ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించి ఆ స్థానంలో రియో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వారికి అప్పగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జియో సిమ్‌లు తిరిగి ఇచ్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

‘ఉచిత’ ఆఫర్‌తో టెలికం గుండెల్లో వణుకు పుట్టించిన రిలయన్స్‌ ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్న షారూఖ్‌కు కూడా ఇది షాకింగే. అయితే నెటిజన్ల విమర్శలు, పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంపై అటు రిలయన్స్ నుంచి కానీ, ఇటు షారూఖ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. నిన్నమొన్నటి వరకు జియో సిమ్‌ల కోసం ఎగబడిన వారంతా నేడు ఆ సర్వీస్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరిస్తుండటంతో ఏం చేస్తారా దేశమంతా ఎదురుచూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharuh Khan  reliance Jio Ad  Twitter  troll  ambassador  

Other Articles