నిర్మాతతో పెళ్లా... హా.హా..హా... | anushka shetty condemn marriage rumours with Producer.

Anushka shetty respond on rumours

Anushka Shetty condemn marriage rumours, Anushka Shetty marriage rumours, Anushka marriage rumours, Anushka Shetty affair with top producer, Anushka Shetty affair with producer, Anushka affair with producer, Actress Anushka affair

Anushka Shetty condemn marriage rumours with Producer.

నిర్మాతతో అఫైర్ పై దేవసేన

Posted: 09/23/2016 06:18 PM IST
Anushka shetty respond on rumours

హీరోయిన్లంటే కేవలం గ్లామర్ తప్ప గట్స్ లేవనుకుంటున్న టైంలో లేడీ ఓరియంటల్ చిత్రాలకు తెరలేపి లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. దశాబ్దంకి పైగా  ఇండస్ట్రీలో సక్సెస్ రేటు కంటే, తనకు పేరు తెచ్చిన పాత్రలను గుర్తుపెట్టుకోవటమే ఇష్టమని చెబుతోంది. ఇన్నాళ్ల కెరీర్ లో ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ ఫెర్ ఫార్మెన్స్ కి ఎంత మంది హాట్సాఫ్ చెప్పారో, కెరీర్ మొదట్లో అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపించాయి. అయినా అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లటమే తన లక్ష్యమని స్పష్టం చేసింది.

అదే సమయంలో రూమర్ల గురించి ప్రస్తావిస్తూ... 'ప్రపంచం నా గురించి ఏం అనుకుంటోందో అని ఆలోచించే మెంటాలిటీ నాకు లేదు. వాళ్లేం అనుకుంటున్నారో.. వీళ్లేం ఆలోచిస్తున్నారో అని ఆలోచించి బెంగ పెట్టుకుంటే.. ప్రతీ రోజూ ఏడుస్తూనే ఉండాల్సొస్తుంది'. అయితే ఇలా కల్లబొల్లి కబుర్లు రాసే రూమర్ల కారణంగా.. వ్యక్తిగత జీవితంలో కొంత బాధ పడ్డ మాట వాస్తవమే. 'రాసేవాళ్లు రాస్తుంటారు. అలాగని ఏడుస్తూ ఉండిపోను. కొంత బాధపడి.. ఇలా రాశారేంటి అనుకుంటాను. కానీ అది కొంతసేపే' అంటోంది స్వీటీ.

'గుండెలపై బరువుంటే కనీసం నిద్ర కూడా పట్టదు. అందుకే పడుకోబోయే ముందు కాసేపు కూడా మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. తప్పుచేసిన వారికే తప్ప.. నాకు ఆ ఫీలింగ్ అసలు రాదు. ఆ టైపు ఆలోచనలేవీ దగ్గరకు రానివ్వను. అందుకే ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నా' అంటోంది స్వీటి. తాజాగా ఓ టాప్ ప్రోడ్యూసర్ తో అఫైర్ సాగిస్తున్న అనుష్క త్వరలో అతనితో వివాహానికి సిద్ధమైపోతుందని కొందరు ప్రచారం చేసేస్తున్నారు. ఈ దశలోనే అనుష్క స్పందించాల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Anushka Shetty  Marriage  rumours  condemns  

Other Articles