ఐటెం సాంగ్ ఆ ఒక్క పాట చాలు సినిమాలో యువతకు హుషారు తెచ్చిపెట్టేందుకు.... ఇప్పుడున్నదంతా అర్టీఫిషీయల్ పాటలు. కానీ, ఒకప్పుడు అసలు సిసలైన మాస్ మసాలా రుచులను చూపించారు జయమాలిని, జ్యోతిలక్ష్మి, హలం లాంటి వాళ్లు. కానీ, వాళ్ల కెరీర్ ముగింపు దశలో ఉండగా, తెరపై కనిపించి సంచలనాలు సృష్టించింది సిల్మ్ స్మిత. చప్పగా సాగుతున్న సినిమాకు ఒక్క పాటతో ఊపు తెచ్చింది. కుర్రాకారుకు అందాల విందు పంచింది... పెద్దవాళ్లను మత్తెక్కించింది. టోటల్ గా అందరి మదిలో గూడు కట్టుకుంది.
1980-90లలో దక్షిణాది సినిమాలోని అన్ని భాషల్లో ఓ ఊపు ఊపేసిన సిల్క్ స్మిత స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు. అసలు పేరు విజయలక్ష్మి. 8వ తరగతి వరకు అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న సిల్కు ఆపై సినిమా పిచ్చితో చెన్నై చెక్కేసింది. మూడేళ్లు అష్టకష్టాలు పడి 1979లో ‘వండిచక్రం’ అనే తమిళ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన విజయలక్ష్మి... సిల్క్స్మితగా మారింది. అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఐటెం పాటలకు కొత్త ఒరవడిని ఆపాదించింది. అప్పట్లో ఆమె లేని సినిమాను అభిమానులు ఊహించలేకపోయేవారు.
ఓవైపు ఐటెం గర్ల్ గానే కాదు సీతాకోక చిలుక తదితర సినిమాల్లో మంచిపాత్రలే పోషించారు. ఆపై నృత్యంలో పేరు తెచ్చుకోవడం, వాంప్ పాత్రలు రావడం అలా ఆ పాత్రల్లో ఆమె ఓదిగిపోయారు. అత్యధికంగా తెలుగు సినిమాల్లో నటించినా తమిళం, కన్నడం, మలయాళం హిందీలలో 148 సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణతో పాటు యువ నటులతో కొన్ని పాత్రలు పోషించారు. నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది. తన నటన, హావభావాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసిన స్మిత సెప్టెంబరు 23, 1996లో ఆత్మహత్య చేసుకుని సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వెండితెరకు ఆమె దూరమై రెండు దశాబ్దాలు అయినా అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరిచిపోలేదు. ప్రతీ సంవత్సరం ఆమె వర్ధంతి రోజున నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. వీరాభిమానులైతే పోస్టర్లు వేయించి ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
ఆమె మృతి మిస్టరీగానే ఉన్నప్పటికీ, ఓ టాప్ హీరో మూలంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వాదన ఉంది. చనిపోయాక కూడా ఈ శృంగార తార సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఆమె జీవిత చరిత్ర కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాలీవుడ్ లో ఏకంగా డర్టీ పిక్చర్స్ తో తెరకెక్కిన సినిమా కాసుల వర్షం కురిపించడమేకాదు, అందులో సిల్క్ పాత్రలో జీవించిన విద్యాబాలన్ కి జాతీయ అవార్డు వచ్చేలా చేసింది. ఆపై తమిళం, మలయాళం, కన్నడలో కూడా ఆమె జీవితంపైనే సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి కూడా...
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more