వర్మ దృష్టిలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే... | Ram Gopal Varma's Sarkar 3 First Look

Ram gopal varma s sarkar 3 characters posters

RGV Sarkar 3, Sarkar 3 First look, Sarkar 3 Varma, RGV Sarkar 3 First look, Kejriwal in Sarkar 3, Varma about best actor, Best Actor for Varma, RGV about Manoj Bajpayee

Ram Gopal Varma's Sarkar 3 New Characters with First Look.

వర్మ సినిమాలో కేజ్రీవాల్ కి క్యారెక్టర్?

Posted: 10/17/2016 01:53 PM IST
Ram gopal varma s sarkar 3 characters posters

తెలుగు తర్వాత బాలీవుడ్ కు వెళ్లిన వర్మ అక్కడ తక్కువ టైంలోనే స్టార్ దర్శకుడిగా ఎదిగిపోయాడు. ప్రారంభంలో రొమాంటికి్ ట్రాక్ లను తెరకెక్కించిన వర్మ, తర్వాత యథార్థ ఘటనలతోనే అందరి దృష్టిని ఆకట్టుకోసాగాడు. అందులో అమితాబ్ లాంటి స్టార్ హీరోతో చేసిన ‘సర్కార్’ ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి. మొదటి రెండు పార్ట్ లు బ్లాక్ బస్టర్లు కావటంతో ఇప్పుడు మూడో పార్ట్ కి తెరలేపాడు వర్మ. ఇందుకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ గత రాత్రి వరుసగా పోస్టర్లు పెట్టాడు.

ముందుగా యామీ గౌతమ్ అన్ను కరకరే పాత్ర తన తండ్రిని చంపిన సర్కార్ పై ప్రతీకారంతో రగిలిపోయే యువతిగా వివిధ హవాభావాలతో చూపించాడు. ఫెయిరెస్ట్ అండ్ లవ్లీయెస్ట్ అంటూ చమత్కారం ప్రదర్శించాడు. ఆపై నటుడు రోనిత్ రాయ్ ని సర్కార్ రైట్ హ్యాండ్ గా గోకుల్ శాతమ్ రోల్ పోషిస్తున్నట్లు చెప్పాడు. శివాజీ అలియాస్ చీకు పాత్రలో యువనటుడు అమిత్ ను చూపించాడు. ఇక సీనియర్ నటుడు జాకీష్రాఫ్ ను సర్ అని పిలిచే ఓ క్రూర పాత్ర పోస్టర్ ను వదిలాడు. మరో నటుడు భరత్ ధబోల్కర్ ను ఓ మంత్రి క్యారెక్టర్ పోషిస్తున్నట్లు చూపించాడు.

సీనియర్ నటి రోహిణి హట్టాంగడిని బీడీ తాగుతూ చూపిస్తూ రుక్కు బాయ్ దేవిగా దర్శనమిప్పించాడు. చివరగా కొత్త యాక్టర్ అని వ్యంగ్యంగా సంభోదిస్తూ అమితాబ్ పోస్టర్ ను వదిలాడు. సుభాష్ నగరే అని పాత్రలో కనిపించబోతున్నాడంటూ చెప్పేశాడు. ఇలా వర్మ వదిలిన అన్ని పోస్టర్లలో క్రూరత్వం ఉట్టిపడేలా చూసుకున్నాడు. అయితే వీటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేజ్రీవాల్ పాత్రను పోలి ఉన్న గోవింద్ దేశ్ పాండే పాత్ర గురించి...

ఈ రోల్ ను టాలెండెట్ నటుడు మనోజ్ బాజ్ పాయి పోషిస్తున్నాడు. నా పాత శత్రువు (వర్మ సత్య సినిమాలో కీ రోల్ చేశాడు కదా) అని చెబుతూ చివర్లో కేజ్రీవాల్ కు చురక అంటించాడు. మనోజ్ బాయ్ పాల్ ఫెంటాస్టిక్ యాక్టర్ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కంటే మాత్రం కాదు అంటూ చివరి ట్వీట్ వేశాడు. మొదటి రెండు పార్ట్ లలో ఉన్న అభిషేక్ అండ్ ఐశ్వర్యలకు ఇందులో స్థానంలో లేదని, వేరు కథ కుదిరినప్పుడు తీద్దామంటూ చెప్పుకోచ్చాడు. అసలు ఎప్పుడు సినిమాలు తీస్తాడో తెలీదు గానీ ఇటు వంగవీటి, అటూ సర్కార్ 3 లతో ఎటువంటి షాక్ లు ఇస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal varma  Sarkar 3  Kejriwal Role  Manoj Bajpayee  

Other Articles