ఒకే సినిమాకు రెండు టైటిళ్లు ఫిక్స్ చేయటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకటి నేరుగా తెలుగు సినిమా కాగా, మరోకటి హిందీ నుంచి డబ్బింగ్ కాబోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అప్ కమింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ "కాబిల్". జనవరి 26న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. హృతిక్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి తెలుగులో "బలం" అనే టైటిల్ ను ఫిక్స్ చేసేశారు.
అయితే ఇదే టైటిల్ తో ఈ మధ్యే ఓ తెలుగు సినిమా అనౌన్స్ చేయటం విశేషం. గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో ఓ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కాకుండా ఆగిపోయింది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి కూడా బలం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీపావళికి చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి నవంబర్ ఎండింగ్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
అల్రెడీ వారం క్రితమే గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ అంటూ బలం గురించి మొత్తం డీటెయిల్స్ అనౌన్స్ చేసేశారు. ఇంతలో కాబ్లీ టీజర్ వచ్చాక ఇప్పుడు తెలుగు వర్షన్ కోసం బలం అనే టైటిల్ ను ఇస్తున్నట్లు చెప్పేశారు. మరి ఈ రెండింటికి క్లాష్ ఆఫ్ ది టైటిల్ జరగదంటారా? లేదా హృతిక్ కాబ్లీ అలా ఏదైనా ట్యాగ్ లైన్ తగిలిస్తారా? మాస్ లో మంచి ఇమేజ్ ఉన్న గోపీచంద్ కోసమే టైటిల్ మారుస్తారా? చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more