హాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయటమే కాదు, వారి న్యూడ్ ఫోటోలను దొంగిలించి వాటితో సొమ్ము చేసుకున్నందుకు ర్యాన్ కోలిన్స్ అనే వ్యక్తికి శిక్ష పడింది. అతనికి 18 నెలల విధిస్తూ అమెరికాలోని పెన్సిల్వేనియా కోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మా స్టోన్, జెన్నిఫర్ లారెన్స్, మేరీ ఎలిజబెత్ విన్ స్టెడ్ లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇతగాడి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కున్న వారే. 2014 సెప్టెంబర్ లో ఫోటోలు హ్యాక్ కాగా, ఆ తర్వాతి సంవత్సరం మార్చిలో నిందితుడు ర్యాన్ ను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో ఒక్కసారిగా ప్రపంచమంతా షాక్ కి గురి కాగా, అమెరికా గూఢాచార్య సంస్థ ఎఫ్ బీఐ విచారణను ప్రారంభించింది. అయితే తాను కేవలం హ్యాక్ చేసి ఫోటోలను సంపాదించానే తప్ప, వాటిని లీక్ చేయలేదని 36 ఏళ్ల ర్యాన్ వాదించాడు. కంప్యూటర్ ఫ్రాడ్ కింద అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ ఎట్టకేలకు కోర్టును నివేదిక సమర్పించింది.
సింపుల్ గా గూగుల్-యాపిల్ నుంచి ఈమెయిళ్లను పంపి సెలబ్రిటీలను తెలివిగా కోలిన్స్ బోల్తా కొట్టించాడు. 2012 నుంచి 2014 మధ్య చాలా మంది సెలబ్రిటీల రహస్య చిత్రాలను కొలిన్స్ హ్యాక్ చేశాడు. ఆ కేసును సెలబ్గేట్గా పిలుస్తున్నారు. నేరస్తుడు కొలిన్స్ సుమారు 50 ఐక్లౌడ్, 72 జీమెయిల్ అకౌంట్లను హ్యాక్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు నిర్ధారించారు. నకిలీ ఈమెయిల్ అడ్రస్‌లతో టాప్ స్టార్ల ఫోటోలను అతను సంపాదించాడు. అంతేకాదు మోడలిగ్ స్కామ్ లో నగ్న ఫోటోలు పంపటంపై కూడా అతనిపై ఆరోపణలు రుజువయ్యాయి. అయితే సాధారణంగా ఇలాంటి శిక్షలకు తమ చట్టాల ప్రకారం కఠిన చట్టాలు పడతాయని ఊహిస్తే.. తక్కువ శిక్షతో సరిపెట్టడంపై ఆయా సెలబ్రిటీలు పెదవి విరుస్తున్నారు.
ఇదిలా ఉంటే... ఈ జూలైలో ఎడ్ వర్డ్ అనే 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుమారు 300 జీమెయిల్స్ మరియు ఐ క్లౌడ్స్ అకౌంట్లను హ్యాక్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే నగ్న ఫోటోలు లీక్ చేశాడా లేదా అన్నది ఇంకా తేల్చాల్సి ఉ:ది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more