పెళ్లి వార్తలతో సమంత పేరు ఈ యేడాది మొత్తం నానుతూనే ఉంది. అ.ఆ.. తర్వాత ఇంక సినిమాలతో సైన్ చేయకపోవటంతో, గుడ్ బై చెప్పటం, పెళ్లి పీటలు ఎక్కటం ఖాయమైపోయింది. అయితే వైవాహిక జీవితానికి, సినిమాలకు సంబంధం లేదని పెద్ద మనసుతో చైతూ ఓపెన్ గా చెప్పటంతో మళ్లీ మేకప్ వేసుకోవచ్చని ఇండైరక్ట్ గా సామ్ కి సంకేతాలు ఇచ్చాడని అనుకోవచ్చు. ఆ మధ్య శివకార్తీకేయన్ సినిమా ఒప్పుకుందని, తర్వాత విశాల్ సినిమా అని కథలు చెప్పుకున్నారు.
కానీ, విశాల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటోందన్న విషయం సమంత చెప్పేదాకా ఎవరికీ తెలిదంటే ఎంత ప్రైవసీ మెయింటెన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ట్వీట్టర్ లో రీసెంట్ ఈ విషయాన్ని ఓ ఫోటో ద్వారా తెలియజేసింది. థ్రిల్లర్ జోనర్ లో ఇరుంబు తిరాయ్ రూపొందుతుండగా.. విశాల్ హీరోగా మరో కోలీవుడ్ హీరో ఆర్య విలన్ గా నటిస్తుండడం విశేషం. పీఎస్ మిత్రన్(దర్శకుడు ).. జార్జ్ (సినిమాటోగ్రాఫర్) లు సూపర్ ట్యాలెంటెడ్' అంటూ ట్వీట్ చేసింది సమంత.
ఇక రీసెంట్ గా విడుదలైన ఓ ఫోటో సమంత అందాలను ఆవిష్కరిస్తోంది. కాబోయే భర్త, అత్తగారితో కనిపించిన ఫోటోల్లో కాస్త డల్ గా కనిపించిన ఈ బ్యూటీ మళ్లీ హాట్ అవతారంలోకి మారిపోయింది. ఓ పార్టీ వేర్ ధరించి సొగసులను ఆరబోసింది. ఇలా మెయింటెన్ చేస్తే పెళ్లయ్యాక ఏంటి? ఇంకా పదేళ్లు కూడా టాప్ హీరోయిన్ గానే దున్నేయటం ఖాయమనే అనుకోవచ్చు.
First schedule over#IrumbuThirai .The most amazingly talented duo these two @Psmithran @george_dop . So happy pic.twitter.com/1DhfcR7tsP
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 28, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more