పండగ పూట చెర్రీ పాపం.. కారణం ఎవరూ? | ram cherry spends diwali time in gym

Ram cherry spends diwali time in gym

Ram Cherry celebrates his diwali in Gym, Upasana shares husband shirtless video, upasana cherry gym video, ram charan diwali in gym, dhruva hard work, cherry work outs for title song

Ram Cherry celebrates his diwali in Gym.

చెర్రీకి తగిన శాస్త్రే జరిగింది

Posted: 10/31/2016 03:56 PM IST
Ram cherry spends diwali time in gym

అదేంటీ సినిమా లేటయ్యింది. అందుకేగా ఫస్ట్ లుక్ , టీజర్, మళ్లీ పండగకి పోస్టర్లు వదిలాడు. అయినా కూడా చెర్రీని ఆడిపోసుకుంటున్నారు ఏంటా? అనుకుంటున్నారా? అంతేకాదు దీనికి కారణం ఎవరనుకుంటన్నారా? ఇంకెవరూ ఈ మెగా పవర్ స్టారే. ప్రస్తుతం చెర్రీ పరిస్థితి చూసి ఈ కామెంట్లు చేయాల్సి వస్తుంది. అదెందుకో తర్వాత చెబుతాం గానీ...

ధ్రువ కోసం క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించాడు. చెర్రీ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకోవడమే కాక జిమ్ లో భారీ వర్కవుట్స్ చేస్తున్నాడు. ఇందుకోసం పండగను, ఫ్యామిలీని కూడా వదిలేసిన చెర్రీ ఇలా జిమ్ లో వాలిపోయాడు. 'జిమ్ లో నా ట్రైనర్ రాకేష్ తో ఇలా దివాళి పండుగ చేసుకుంటున్నా. నవంబర్ 2నుంచి ప్రారంభం కానున్న ధృవ టైటిల్ సాంగ్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నా. హ్యాపీ దీవాలి' అని పోస్ట్ చేశాడు చెర్రీ. ఇక వైఫ్ ఉపాసన కూడా మొగుడ్ని బాగానే ఎంకరేజ్ చేస్తోంది. మిస్టర్ సీ పండగ పూట ఏం చేస్తున్నాడో చూడండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

 

తన కన్నా వెనుక వచ్చినవాళ్లు కూడా సక్సెస్ రేటులో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. మరి వాళ్లను అందుకోవాలంటే బిగ్ సాలిడ్ హిట్ చరణ్ అందుకోవాల్సి ఉంటుంది. మరి అభిమానుల ఆ కోరిక తీర్చాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. అందుకే చెర్రీ ఇంత కష్టపడుతున్నా కూడా అభిమానులు మాకు హిట్ కావాల్సిందేనని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  diwali 2016  dhruva hard work  title song  upasana video  

Other Articles