గౌతమీ బ్రేకప్ పై కమల్ రియాక్షన్ | kamla hassan reaction after break up with gautami

Kamla hassan reaction after break up with gautami

kamal gautami break up, Gautami Break up, kamal reaction after break up, kamal with three daughters, kamal daughter subbu, gautami daughter subbu, kamal subba lakshmi, kamal with all daughters, kamal about gautami, kamal hassan unhappy with gautami break up, kamal gautami break up, shruthi hassan gautami

Kamal Hassan response after Gautami announced their break up.

గౌతమీ బ్రేకప్ పై కమల్ స్పందన ఫేక్

Posted: 11/02/2016 12:19 PM IST
Kamla hassan reaction after break up with gautami

సౌత్ లో హాట్ టాపిక్ అయిన ఆ జంట రిలేషన్ షిప్ పై ఎవరి కళ్లు పడ్డాయో ఏమో దశాబ్దంన్నర రిలేషన్ కు పుల్ స్టాప్ పడిపోయింది. అయినా వయసు రీత్యా వారి మెచ్యూరిటీ చూపిస్తూ విడిపోయారు. తాను కమల్ నుంచి చాలా పొందానని, ఆ జ్నాపకాలు చాలని, ఇక కూతురి కోసం మిగిలిన జీవితం గడుపుతానంటూ గౌతమీ తమ బ్రేకప్ విషయాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

కమల్ నేను విడిపోతున్నాం-గౌతమీ

శభాష్ నాయుడు చిత్ర సెట్స్ శృతీతో జరిగిన గొడవలే ఇందుకు కారణమంటూ అంతా గుసగుసలాడారు. ఆ విషయంలో నిజనిర్ధారణ పక్కనబెడితే విడిపోవటంపై కమల్ ఒపీనియన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా? మరి దానిపై ఇప్పడు లోకనాయకుడు కూడా స్పందించేశాడు.

ఆమెకు కాన్సర్ వచ్చిన సమయంలో కమల్ ఎలాగైతే ఆమెకు తోడుగా నిలిచాడో... ఈ మధ్య కమల్ కాలిగాయం అయిన సమయంలోనూ గౌతమీ పక్కే ఉండి అన్నీ చూసుకుంది తెలిసిందే. ఆ విషయాలన్నింటిని ప్రస్తావిస్తూ కమల్... ‘‘ఆమెకు ఏది అనుకూలంగా ఉంటే దానికి అనుగుణంగానే నేను మసలుకుంటాను. గౌతమీ, సుబ్బు(గౌతమీ కూతురు) వారి జీవితం వారి చేతుల్లోనే ఉంది. నా ఫీలింగ్స్ కి పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఏ విషయాలైతే సంతోషం కలిగిస్తాయో వారు అది చేసుకోవచ్చు. భవిష్యత్తులో వారికి ఏం సాయం కావాల్సి వచ్చినా నేను ఉన్నాననే భరోసా ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో నేనే అదృష్టవంతుడైన తండ్రిని. నాకు ఇద్దరు(శృతీహాసన్, అక్షర) కాదు.. సుబ్బుతో కలిపి ముగ్గురు కూతుళ్లు’’ అంటూ ఎమోషన్ అయ్యాడు కమల్.

అయితే తాను ఎటువంటి ప్రకటనా చేయలేదని ప్రముఖ నటుడు కమలహాసన్ స్వయంగా పేర్కొన్నారు. తన పేరిట తప్పుడు ప్రకటనలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని, వాటిని నమ్మవద్దని కమల్ కోరారు. ఈ మేరకు కమల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తమిళంలో ట్వీట్ చేశారు. ఈ విషయమై కొందరు తన పేరిట ప్రకటనలు విడుదల చేయడం, వాటిని ప్రచారం చేయడం అనాగరిక చర్య అని, ఇప్పట్లో తాను ఎటువంటి ప్రకటనా జారీ చేయనని కమల్ స్పష్టం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  gautami break up  

Other Articles