కెరీర్ మొదట్లో కేవలం గ్లామర్ మాత్రమే గుప్పించిన బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ఇప్పుడు చాలా మారిపోయింది. ఎంటైర్ టైన్ మెంట్ క్యారెక్టర్లతో ఆకట్టుకోంటోంది. ఫ్లాపులుగా నిలిచిన శివం, హైపర్ లోనే కాదు, బెంగాల్ టైగర్, పటాస్, లో రాశి యాక్టింగ్ చూస్తే ఎవరైనా అది ఒప్పుకుంటారు. కానీ, ఓవరాల్ గా ఫ్లాపుల పర్సంటేజ్ ఎక్కువగా ఉండటంతో పెద్ద స్టార్లెవరూ ఆమెవైపే చూడటం మానేశారు.
దానికి తోడు ఇప్పటికే ఫ్లాప్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం, చేస్తున్న ప్రాజెక్టులు డైలామాలో పడిపోవటంతో రాశి కెరీర్ డేంజర్ జోన్ లో పడిపోయింది. అయితే అనుకోని అదృష్టం ఇప్పుడు ఆమెను వరించింది. మెగా సినిమాలో నటించే బంఫరాఫర్ ఆమెను వరించింది. అయితే అందుకోసం రాశి పెద్ద టెస్ట్ నే ఎదుర్కోవాల్సి ఉంది. ప్రస్తుతం ధృవ పూర్తయిపోవటంతో సుకుమార్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ సినిమా కోసం టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో ఒకరైన రాశి ఖన్నాను పరిశీలిస్తున్నాడట సుకుమార్.
చెర్రీ-సుక్కులు ఓ పక్కా పల్లెటూరి ప్రేమకథను ప్రేక్షకులను అందించబోతున్నారు. ఈ లవ్ స్టోరీలో గ్రామీణ ప్రాంత యువతిగా హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యం. అచ్చమైన తెలుగింటి అమ్మాయి లుక్స్ కచ్చితంగా ఉండాలన్నది మెయిన్ కండిషన్. అందుకే రాశిని ఎగాదిగా పరీక్షలు చేస్తున్నాడంట. మరి లెక్కల మాష్టార్ లెక్కకి రాశి అందుతుందో లేదో.. అందితే మాత్రం రాశీ డ్రీమ్ తీరినట్లే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more