ఇప్పుడున్న టాప్ హీరోలంతా కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేయటంలో ఎలాంటి బెణుకు ప్రదర్శించకుండా ముందుకు వస్తున్నారు. టాలెంట్ ఉంటే చాలూ వారి కోసం కాస్త టైం కేటాయించి ఫ్రీ ప్రమోషన్ చేసేస్తున్నారు. మెగాస్టార్ చిరు ఆ వరుసలో ఎప్పుడూ ముందుంటాడు కూడా. రీసెంట్ గా ఓ కమెడియన్ కోసం ఏకంగా గంటపాటు సమయం కేటాయించిన చిరు వ్యక్తిత్వం చూసి అతగాడికి మాటలు రాలేదంట.
అతనెవరో కాదు ముందు జబర్దస్త్ కామెడీ షో తో, ఆపై యాంకర్ రష్మీతో అఫైర్ తో, ఈ మధ్య సినిమాలతో కూడా బాగా పాపులర్ అవుతున్న సుడిగాలి సుధీర్. రీసెంట్ గా మనోడు కొత్తగా ఓ ఇల్లు కొనుక్కున్నాడు. దానికి గృహప్రవేశం ఆహ్వానం కోసం పేరెంట్స్ తో సహా మెగాస్టార్ ఇంటికి వెళ్లాడంట. పెద్ద స్టార్ హీరో, పైగా 150వ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు కదా! ఓ ఐదు నిమిషాలు సమయం కేటాయించకపోతారా అని అనుకున్నాడంట. కానీ, చిరు మాత్రం పెద్ద షాకే ఇచ్చాడని తెలుస్తోంది.
ఏకంగా గంటపాటు ఈ సోదిగాడు సారీ... సుడిగాలి సుధీర్ తో ముచ్చటలాడాడంట. అంతేకాదు తన వెంట వచ్చిన తల్లిదండ్రులకు. తనకు కొత్త బట్టలు కూడా పెట్టి అతిథి మర్యాదలు చేశాడంట. ఈ విషయాలన్నింటినీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి మురిసిపోయాడు సుధీర్. ‘‘చిరు నా రోల్ మోడల్. ఆయన ప్రేరణతోనే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. అలాంటి వ్యక్తి అప్యాయంగా పలకరించేసరికి కాళ్లు, చేతులు వణికిపోయాయి. నిజంగా ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అంటూ బోల్డెంత పొగడ్తలతో సందేశం ఉంచాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more