టైటిల్ తీసుకోవటం చాలా సిగ్గుగా అనిపించింది.. సప్తగిరికి థాంక్స్ | pawan speech at saptagiri express audio.

Pawan speech at saptagiri express audio

Pawan saptagiri, Pawan kalyan about Saptagiri, Pawan Kalyan about Katamarayudu audio, Pawan Saptagiri speech, Pawan saptagiri express, Pawan Kalyan Nikolai Bulganin, Pawan Bulganin

pawan kalyan speech at saptagiri express audio and gives clarity why he attends to this audio.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ పవన్ రాకకు కారణం వేరే?

Posted: 11/07/2016 08:24 AM IST
Pawan speech at saptagiri express audio

సాధారణంగా బయట ఎక్కడా ఎక్కువ పంక్షన్లకు హాజరకు కానీ పవన్ కమెడియన్ సప్తగిరి సినిమా ఆడియో వేడుకకు వస్తాడని ముందునుంచే చెప్పుకుంటున్నాం. అయితే కేవలం టైటిల్ ఒక్కటే కారణం కాదన్న పవన్ తాను ఇక్కడికి ఎందుకు వచ్చానో వివరించాడు. 'సప్తగిరి కోసం ఈ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను సహజంగా ఎక్కడికీ రాను కానీ.. మీ అందరి ప్రేమకు కచ్చితంగా స్పందిస్తాను.. అందుకే ఇక్కడికొచ్చాను. సప్తగిరి గబ్బర్ సింగ్ లో చేసిన చిన్న బిట్ నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి కలుసుకుందామని అనుకున్నాను.. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది.

‘శరత్ మరార్ తో ప్రస్తుతం నేను తీసే సినిమాకి కాటమరాయుడు అనే టైటిల్ అంటే.. బావుంటుంది పెట్టమని చెప్పాను. నిర్మాత.. సప్తగిరి.. అరుణ్ పవార్ ది ఎంత మంచి మనసంటే.. 70 శాతం షూటింగ్ పూర్తయ్యాక వాళ్ల టైటిల్ మార్చుకుని ఇచ్చారు. నాకు ఇవన్నీ తెలీదు. తెలిశాక అడగొద్దని చెప్పాను.. అలా అడగడం కూడా నాకు సిగ్గు అనిపించింది. కానీ వాళ్లే వచ్చి విషయం చెప్పారు. కాటమరాయుడు టైటిల్ ఇచ్చిన నిర్మాత గారికి.. సప్తగిరి గారికి ధన్యవాదాలు' అంటూ అసలు విషయం చెప్పాడు పవన్.

''నేను సినిమాలు తక్కువగా చూస్తాను.. నా సినిమాలు కూడా 2-3 చూడలేదు. కానీ సప్తగిరి సినిమా చూడాలని అనుకుంటున్నా. ఆయన కామెడీ అందులో ఉండే ఎనర్జీ నాకు బాగా నచ్చుతుంది. నిర్మాతను అడిగి కచ్చితంగా ఒక షో వేసుకుని చూస్తాను. అరుణ్ పవార్ చాలా సంవత్సరాలుగా తెలుసు. త్రివిక్రమ్ కు సన్నిహితుడు. రోజు చూస్కుంటూ ఉంటాం కానీ మాట్లాడుకున్నది తక్కువ. సర్దార్ మూవీకి కూడా హెల్ప్ చేశారు. థియేటర్ కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆనందం ఈ సినిమా కలిగించాలని కోరకుంటాను'' అంటూ సప్తగిరి ఎక్స్ ప్రెస్ యూనిట్ కి అభినందనలు చెప్పాడు పవన్.

 

ఇక పవన్ స్పీచ్ కొనసాగిస్తుండగా, ఓ వ్యక్తి కాళ్ళకు దండం పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ''దండం పెట్టకు.. నాకు దండం పెడితే పారిపోయి పరిగెట్టాలని అనిపిస్తుంది. బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. జైహింద్'' అన్నాడు పవన్. అయితే ఎలాంటి ఫంక్షన్ లో అయినా చివరగా జైహింద్ అనడం పవన్ కళ్యాణ్ కు అలవాటు. అలా ఓసారి జైహింద్ చెప్పాక.. ఇక ఆ ప్లేస్ లో కనిపించకుండా స్పీడ్ గా వెళ్లిపోతాడు. కానీ సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో జైహింద్ అనేసి బయల్దేరిసిన పవర్ స్టార్ ని.. మ్యూజిక్ డైరెక్టర్ బుల్గానిన్ కారణంగా బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన బుల్గానిన్ గురించి మాట్లాడలేదనే విషయం గుర్తొచ్చి ఆగిపోయి మళ్లీ మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఇది ఆ కంపోజర్ ఎఫెక్ట్ కాదు.. 'బుల్గానిన్' అనే పేరు మాత్రమే పవన్ ఆగిపోవడానికి కారణం.

ఇంతకీ ఎవరీ బుల్గానిన్ అంటే.. కమ్యూనిస్ట్ లీడర్లలో ఒక పెద్దాయన. నికొలాయ్ అలెగ్జాండ్రోవిచ్ బుల్గానిన్ ఈయన పూర్తి పేరు. సోవియట్ యూనియన్ లో అనేక పదవుల్లో విధులు నిర్వహించిన ఈయన.. రెడ్ ఆర్మీతో పాటు స్టాలిన్ నాయకత్వంలో డిఫెన్స్ మినిస్టర్ గా కూడా పని చేశారు. అంతే కాదు.. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో స్టాలిన్ కు మొదటి డిప్యూటీ కూడా. 1955లో కురుస్చేవ్ తో కలిసి ఇండియాను విజిట్ చేసిన కమ్యూనిస్ట్ లీడర్ కూడా. అందుకే బుల్గానిన్ అనే పేరు గల వ్యక్తి కనిపించగానే ఆగిపోయిన పవన్ కళ్యాణ్.. 'బుల్గానిన్ అనే పేరు మా ఇంట్లో చిన్నప్పుడు నాన్నగారి దగ్గర ఎక్కువగా వినివాడిని. కమ్యూనిస్ట్ ల పేర్లు ఎక్కువగా వినిపించేవి.. మా నాన్నగారి ప్రభావం. బుల్గానిన్ అనే పేరు నాకు బాగా ఫెమిలియర్' అన్నాడు.

'ఇందాక ప్లే చేసిన మెలోడీ మళ్లీ విందామని అనుకునేలోపు 30సెకన్లకే కట్ చేశారు. చాలా బాధగా అనిపించింది. చిత్ర సీమలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నా. నాకు తెలిసిన కొద్ది అనుభవాన్ని బేస్ చేసుకుని.. ఇతను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నా' అంటూ మరోసారి జైహింద్ చెప్పాడు పవన్ కళ్యాణ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Saptagiri Express movie  Audio Lauch  

Other Articles