సినిమా స్టంట్ బిగ్ స్క్రీన్ పై చూసి నోళ్లు తెరుచుకునే మనం వాటి మేకింగ్ వీడియోలు చూసి ఓస్ ఇంతేకదా అనుకున్న రోజులు పోయాయి. ఇప్పుడు ఖచ్ఛితంగా రియాలిటీ కే జనాలు ఓటేస్తున్నారు. తాళ్లు కట్టి డూపులను పెట్టే సంప్రదాయానికి కొందరు హీరోలు కూడా స్వస్తి చేప్పేశారు కూడా. అయితే ఆ ప్రయత్నంలో అప్రమత్తంగా ఉండకపోతే ఏం జరుగుతుందో నిన్న జరిగిన ఉదంతమే ఓ ఉదాహరణ. ఫలితం ఇద్దరు వర్థమాన నటులు ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగింది...
కన్నడలో మాస్తిగుడి అనే ఓ సినిమా తెరకెక్కుతుంది. నాగశేఖర దర్శకత్వంలో దునియా విజయ్, అమూల్య హీరోహీరోయిన్లు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం చిత్రీకరించారు. అయితే డూప్ లే కాదు, కనీసం రక్షణ చర్యలు తీసుకోకుండా వారు ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. హెలికాఫ్టర్ నుంచి ముగ్గురు నటులు చెరువులోకి దూకారు. అయితే, ఈ సంఘటనలో హీరో విజయ్ సురక్షితంగా బయటపడగా, ఉదయ్, అనిల్ మాత్రం మృతి చెందారు.
సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఉదయ్, స్టంట్‌మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకారు. అయితే వీరికి ఈత రాకపోవడం, రక్షక బోట్లు సరైన సమయానికి రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. హీరో విజయ్ కూడా వారి వెనకే దూకినా అతనికి తెప్ప అందడంతో సురక్షితంగా బయటపడ్డాడు. బురద ఎక్కువగా ఉండటంతో వారి దేహాలు అడుగు భాగంలో చిక్కుకుని పోయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అదే కారణమా?
అయితే వాళ్లిద్దరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవటమే వారి మృతికి కారణమంటూ ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హీరో అనే ఉద్దేశంతో విజయ్ కి మాత్రమే దానిని ఇచ్చారని, అందుకే మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారంటూ విమర్శిస్తున్నారు.
మరోవైపు ప్రాణాలు విడిచిన నటుడు ఉదయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తలచుకుని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఇలాంటి స్టంట్ ను నేను చేయడం ఇదే మొదటిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే భయపడే నేను, ఆ దేవుడి దయ వల్ల ఈ స్టంట్ పూర్తి చేస్తానని ఆశిస్తున్నా’ అంటూ కన్నడ న్యూస్ ఛానెల్ ‘సువర్ణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా, 'జక్కన్న', 'బుల్లెట్ రాణి' వంటి తెలుగు చిత్రాల్లో కూడా ఉదయ్ నటించాడు. తాజాగా, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రంలో కూడా ఉదయ్ నటించినట్లు తెలుస్తోంది.
ఇక అనుమతులు లేకుండా షూటింగ్ చేయటమే కాదు, నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు పోయేందుకు కారణమైన మాస్తిగుడి చిత్ర యూనిట్ పై క్రిమినల్ కేసు నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more