పాకిస్థాన్ లో మరో నటి హత్యకు గురైంది. ప్రముఖ రంగస్థల నటి కిస్మత్ బేగ్ ను నడిరోడ్డుపై కిరాతకంగా కొందరు దుండగులు చంపారు. ఆమె ప్రయాణిస్తున్న కారును వెంటాడి మరీ ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశారు.
రెండు రోజుల క్రితం సాయంత్రం లాహోర్ లో తన షో ముగించుకుని ఇంటికి తిరిగి బయలుదేరిన ఆమెను ఆగంతకులు వెంటాడారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా బైక్‌ల ఆపి యాక్సిడెంట్ చేశారు. ఆపై ఆమెతోపాటు డ్రైవర్ పై కూడా కాల్పులు జరిపారు. ‘ఇప్పుడు చెయ్యగలవా డాన్స్..’ అని కోపంగా అరుస్తూ తుపాకులతో నటి కాళ్లు, చేతులు, పొట్టభాగంలో విచక్షనారహితంగా 11 సార్లు కాల్పులు జరిపి పారిపోయారు.
స్థానికులు నటిని, ఆమె డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆమె కన్ను మూసింది. ఈ హత్య వెనుక కిస్మత్ మాజీ ప్రియుడు, ఫైసలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ స్పృహాలోకి వచ్చాక మరింత సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేస్తామని వారు తెలిపారు.
అయితే నువ్వు డాన్సు చేస్తావా? అంటూ వారు అరవటంపై పోలీసులకు మరికొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. బహుశా ఇది పరువు హత్య అయి ఉండొచ్చన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. గత జులైలో టాప్ మోడల్ ఖందిల్ బలూచ్ దారుణ హత్య, అంతకుముందు ఐస్ క్రీంలో విషయం కలిపి ఓ టీవీ యాంకర్ హత్య, వీటితోపాటు మరో తొమ్మిది మంది హత్యలు కావటంతో కళాకారుల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా అంటూ కళాకారులంతా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more