అలియా భట్ తల్లి... నిమిషాల్లో 19సార్లు | Soni Razdan scared with robbery

Alia bhatt s mother soni robbed

Alia Bhatt, Soni Razdan, Alia Bhatt’s mother Soni Razdan, Soni Razdan rob, Soni Razdan card, Soni Razdan scare, Soni Razdan actress, Soni Razdan daughters, Soni Razdan husband

Alia Bhatt’s mother Soni Razdan robbed, leaves her ‘scared’.

అలియా భట్ తల్లిని దోచేశారు. మరికాసేపుంటే...

Posted: 11/28/2016 01:24 PM IST
Alia bhatt s mother soni robbed

బాలీవుడ్ సీనియర్ దర్శకుడు మహేష్ భట్ భార్య, ఒకప్పటి నటి సోనీ రాజ్దాన్ కి ఓ దొంగ భలే షాకిచ్చాడు. మొన్న శుక్రవారం రెండో కూతురు షహీన్ తో కలిసి షాపింగ్ కు వెళ్లిన ఆమె బ్యాగును ఎవరో దొంగ కొట్టేశాడు. అందులో కొద్దిపాటి డబ్బే ఉన్నప్పటికీ, ఓ క్రెడిటీ కార్డు కూడా ఉందంట.

షాపింగ్ మూగిశాక బ్యాగు కోసం చూసుకున్న ఆమెకు దొంగతనం గురించి అర్థమయ్యిందంట. తేరుకునేలోపే ఆ నిందితుడు కార్డును 19 సార్లు వాడేశారని సోనీ తెలిపింది. చోరీకి గురైన కార్డును తాను ఎక్కువగా వాడనని, ఆ కార్డు ఎప్పుడూ తన పర్సులోనే ఉంటుందని పేర్కొన్నారు. తన కార్డును దొంగిలించిన వారు దానిని ఉపయోగించిన ప్రతిసారీ, తనకు మెసేజ్ లు వస్తుండటంతో అసలు విషయం తనకు తెలిసిందని చెప్పారు.

చివరిసారి సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో ఆ కార్డు వాడానని చెప్పిన సోనీ, ఈ ఘటనతో ఒక్కసారిగా భయానికిలోనైనట్లు తెలిపింది. బ్యాంక్ కు ఫోన్ చేసి కార్డు బ్లాక్ చేయించానని, తాను వెంటనే స్పందించకపోతే చాలా నష్టపోవాల్సి వచ్చేదానినని సోనీ రాజ్దాన్ చెప్పారు. కాగా, పెద్ద కూతురు అలియా భట్ మాత్రం ఇవేం పట్టవన్నట్లు డియర్ జిందగీ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తోంది. అందులో ఆలియా పోషించిన కైరా క్యారెక్టరే సినిమాకు బలంగా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soni Razdan  Alia Bhatt mother  Rob  

Other Articles