బాహుబలి కంటే ఆ మ్యాటర్ లో ఎక్కువే... అయినా కూడా | Director Krish official announcement on Satakarni.

Krish on satakarni run time

Director Krish, Gautamiputra Satakarni, GSP run time, Balayya 100th movie, bala krishna 100th movie, Balayya GSP movie, GSP all official dates

Director Krish fixed GSP run time and all official dates.

క్రిష్ మున్ముందు మరిన్ని షాక్ లు ఇస్తాడా?

Posted: 11/28/2016 04:38 PM IST
Krish on satakarni run time

ఓ చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం వస్తుందంటే చాలూ జనాలకు ప్రత్యేక ఆసక్తి కలగటం సహజం. ఎందుకంటే చరిత్రలో మనం తొంగిచూడలేని ఎన్నో విషయాలు అందులో మనకు కనిపిస్తాయనే ఓ ఆశ. ప్రస్తుతం బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి మీద కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. దేశంలోనే మొదటి చక్రవర్తి అయిన ఓ తెలుగు రాజు గురించి సంబంధించిన అంశం కాబట్టి కూలంకశంగానే ఉంటుంది అంతా భావిస్తారు. కానీ, ఆ విషయంలో క్రిష్ పెద్ద షాకే ఇవ్వబోతున్నాడు.

బాలయ్య సినిమా వస్తుందంటే హైలెట్ అయ్యేది ఆయన చెప్పే  డైలాగులే. మాస్ ని అలరించేలా డైలాగుల్ని పలకడం బాలకృష్ణ శైలి. అందుకే దర్శకరచయితలు ఆ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు.  బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలోనూ డైలాగులు పేలిపోనున్నాయట. తెలుగు చక్రవర్తి కథ కావడంతో తెలుగు జాతి....  తెలుగు పరాక్రమం... తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పేలా డైలాగుల్ని రాయించాడట దర్శకుడు క్రిష్. వాటిని బాలయ్య పలికిన విధానం కూడా సూపర్బ్గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

అయితే ఆ డైలాగులతోపాటు - వార్ ఎపిసోడ్లు కూడా కీలకమేనట. సినిమాలో ఏకంగా నాలుగు వార్ ఎపిసోడ్లు ఉంటాయట. అవి గ్రాఫిక్స్ హంగులతో బాలకృష్ణ సినిమాల్లోనే కాదు తెలుగు తెరపై ఎప్పుడూ చూడని విధంగా పవర్ ఫుల్ గా ఉంటాయని చెప్పుకుంటున్నారు. అందులో సముద్రంలో వార్ ఎపిసోడ్ అయితే ఇంకా బాగుంటుందని ప్రచారం సాగుతోంది. అలాగే సినిమాను 79 రోజుల్లో పూర్తి చేశానని చెప్పిన క్రిష్, రన్ టైమ్ 2 గంటల 12 నిమిషాలు ఉంటుందని,  ప్రతీ సీన్ రేసీగా సాగుతుందని తెలిపాడు. డిసెంబరు 16న తిరుపతిలో పాటల వేడుకని నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు క్రిష్.

బాహుబలి లాంటి సినిమాకు ఒక్క వార్ సన్నివేశం కోసం జక్కన్న రెండున్నర గంటలకు పైగా సమయం తీసుకుంటే, క్రిష్ మాత్రం శాతకర్ణి కోసం నాలుగా? ఏం చూపించబోతున్నాడు? అన్న డిస్కషన్లు మొదలయ్యాయి. ఇక ఆడియో తర్వాత ప్రమోషన్ కోసం క్రిష్ కంటే బాలయ్యే ఎక్కువ ఊవిళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  100th Movie  gautamiputra satakarni  Official Dates  

Other Articles