రాందేవ్ వర్సెస్ రణ్ వీర్.. ఎవరు గెలిచారంటే... | Ranveer Singh surrendered in front of Baba Ramdev with folded hands.

Baba ramdev defeated ranveer singh in a dance battle

Ranveer Singh, Baba Ramdev, Ranveer Singh Challenged Baba Ramdev, Ranveer Baba Ramdev, Ranveer Singh Baba Ramdev, Ramdev Ranveer, Ranveer vs Ramdev, Ramdev Dance, Ranveer Yoga

Ranveer Singh Challenged Baba Ramdev To A Dance-Off And Instantly Regretted It.

రాందేవ్ వర్సెస్ రణ్ వీర్.. ఏం జరిగింది?

Posted: 12/08/2016 08:29 AM IST
Baba ramdev defeated ranveer singh in a dance battle

బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ సీరియస్ పాత్రలను ఎంత శ్రద్ధగా చేస్తాడో, బయట అంత సిల్లీగా కూడా బిహేవ్ చేస్తుంటాడు. తోటి నటీనటులనే కాదు తనను కలవటానికి వచ్చిన ఫ్యాన్స్ తోనూ చిలిపి పనులతో కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. అయితే పోయి పోయి బాబా రాందేవ్ తో పెట్టుకున్నాడు. ఏం జరిగిందో మీరే చదవండి.

బాలీవుడ్ యువనటుడు రణ్ వీర్ సింగ్, రాందేవ్ బాబా మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 'బేఫికర్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న రణ్ వీర్ సింగ్ ముంబైలో జరిగిన 'ఎజెండా ఆజ్ తక్' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి రాందేవ్ బాబా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబాను చూసిన రణ్ వీర్ సింగ్ తనతో పాటు డ్యాన్స్ చేయాలంటూ కోరాడు. అయితే తనకు డ్యాన్స్ రాదని రాందేవ్ బాబా చెప్పినా బలవంతం చేయడంతో తనకు తెలిసిన సూర్యనమస్కారం చేస్తానని, నువ్వు కూడా చేయాలని రణ్ వీర్ సింగ్ కు సూచించారు.

 

రణ్ వీర్ కూడా అంగీకరించడంతో బాబా తన విశ్వరూపం ప్రదర్శించారు. తన కాషాయపు పంచె మలిచి రణ్ వీర్ ను కూర్చోబెట్టి మరీ యోగాసనాలు వేసి అందర్నీ నిశ్చేష్టులను చేశారు. దీంతో తొలుత ఆసనాలు వేసేందుకు ఉత్సాహం చూపిన రణ్ వీర్ సింగ్, అ తర్వాత రాందేవ్ బాబా ఏ ఆధారం లేకుండా శీర్షాసనం వేయడంతో గుడ్లు తేలేసి తనవల్ల కాదంటూ దండం పెట్టేశాడు. ఇక చివర్లో రాందేవ్ బయోపిక్ లో తానే నటిస్తానంటూ నవ్వులు పూయించాడు రణ్ వీర్. ఆ వీడియోను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramdev Baba  Ranveer Singh  Yoga Challange  

Other Articles