ఊర్లో అందరూ శోభన్ బాబులా ఉన్నావంటే ఎర్రబస్సేక్కి వచ్చేశానని ఖడ్గం సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గౌతంరాజు చెబితే, ‘‘ఏరా మీ ఊళ్లో అద్దాలు అమ్మరా?’’ అంటూ పళ్లున నవ్వుతాడు రవితేజ. సరిగ్గా ఇలాంటి
ఘటననే తన జీవితంలో జరిగిందని చెబుతూ, తాను ఓ సీనియర్ నటుడి చేతిలో ఎలా బకరా అయ్యానో చెబుతున్నాడు కమెడియన్ థర్టీ ఇయర్స్ పృథ్వీ.
డిగ్రీ తర్వాత ఆంధ్రా యూనివర్శిటీలో పృథ్వీ చేశాడు. ఆ సమయంలో క్లాసులు పూర్తవగానే సరదాగా బీచ్ కి వెళ్లేవాళ్లంట. ఓసారి ‘అభిలాష’ షూటింగ్ అక్కడ జరుగుతుంటే చిరంజీవి గారిని చూడటానికి పృథ్వీకి వెళ్లాడంట. ఆపై రెగ్యులర్ గా షూటింగ్ లకు వెళ్లటం అలవాటు చేసుకుని, ఆ వాతావరణం చూసినప్పుడల్లా తనకు తెలీకుండానే సినిమాలపై ఇష్టం పెరుగుతూ వచ్చిందంట.
‘‘నేను కాలేజీలో సాంస్కృతిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వార్షికోత్సవ వేడుక నిర్వహించారు. మా నాన్న ద్వారా నాకు ప్రభాకర్ రెడ్డిగారితో కాస్త పరిచయం ఉండటంతో ఆయన్ని వేడుకకు అతిథిగా రమ్మని అడిగా. ఆయన వచ్చారు. వెళ్తూ వెళ్తూ.. ‘నీ ఎత్తు.. ఫీచర్స్.. బాడీ లాంగ్వేజ్ సినిమాలకు బాగా సరిపోతాయి. పీజీ పూర్తయ్యాక చెన్నై వచ్చేయ్’ అన్నారు. ఆ మాటలు నమ్మేసి నేను నిజంగానే చదువయ్యాక నేరుగా చెన్నై రైలెక్కేశా. తీరా వెళ్లి ప్రభాకర్ రెడ్డిగారిని కలిస్తే వార్నీ ఏదో వంద చెబుతాం. అంత మాత్రనా వచ్చేస్తారా? అంటూ నవ్వు నవ్వేశారు. ఆ దెబ్బకి నాకు మతి పోయింది. ఆపై ఇంత అమాయకుడివి ఎలా పైకొస్తావయ్యా.. అంటూ చిన్నపాటి క్లాసే తీసుకున్నారు’’ అని వివరించాడు పృథ్వీ.
అలా నేను ఫూల్ అయిపోయాను. ఐతే వెంటనే తిరిగి పంపించలేక.. ఏదో ఒకటి చూద్దాంలే అని అక్కడే ఉండమన్నారు. తర్వాత ఓ హోటల్లో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం ఇప్పించారు. అలా ఫూల్ ను కాబట్టే తర్వాత అనేక ఇబ్బందులు పడి సినిమా అవకాశాలు దక్కించుకున్నా’’ అని పృథ్వీ తెలిపాడు. గండిపేట రహాస్యం సినిమా ద్వారా ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేయటం, ఆపై కృష్ణవంశీ ప్రోత్సాహంతో వరుసగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అయిపోయాడు పృథ్వీ. రిలీజ్ కు రెడీగా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో దాదాపు హీరోస్థాయి క్యారెక్టర్ చేస్తుండటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more