ధృవ వీకెండ్ కలెక్షన్లు పెరిగాయా? | Ram Charan Dhruva weekend collections.

Ram charan dhruva weekend collections

Ram Charan Dhruva Weekend collections, Dhruva First Three Days Collections, Dhruva Weekend collections in Overseas, Overseas Dhruva Collections, Druva Collections

Ram Charan Dhruva First weekend collections. Beat janatha Garage second day at overseas.

ధృవ వీకెండ్ కలెక్షన్లు ఏంటి పరిస్థితి?

Posted: 12/12/2016 11:53 AM IST
Ram charan dhruva weekend collections

భారీ అంచనాల మధ్య విడుదలైన ధృవ టాక్ బాగానే ఉన్నప్పటికీ, తొలిరోజు మాత్రం సంచలనాలు క్రియేట్ చేయలేకపోయిందన్నది వాస్తవం. రీమేక్ ఎఫెక్టో, లేక డిమానిటైజేషన్ ప్రభావమో తెలీదుగానీ స్టైలిష్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కలెక్షన్లు ఫస్ట్ డే భారీగానే దెబ్బ వేశాయి. ఈ దశలో రూ.60 కోట్ల దాకా బిజినెస్ జరిగిన సినిమా కనీసం అదైనా చేస్తుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే రెండో, మూడో రోజు మాత్రం కలెక్షన్లు అమాంతం పెరిగిపోవటం మాత్రం విశేషం.

శని, ఆదివారాల్లో ‘ధృవ’కు మంచి కలెక్షన్లే వచ్చాయి. ఫస్ట్ డే ‘ధృవ’ రూ.10.6 కోట్ల షేర్ వసూలు చేయగా.. రెండో రోజు జస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడో రోజు కూడా అంతకన్నా కాస్త ఎక్కవ స్థాయిలోనే వసూలు రాబట్టింది. ఇక తొలి రెండు రోజుల్లో మొత్తంగా వరల్డ్ వైడ్ ‘ధృవ’ రూ.22 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, వీకెండ్ మొత్తం కలుపుకుని 40 కోట్లు వసూలు చేసినట్లు మూవీ ట్రేడ్ అనాలసిస్టులు చెబుతున్నారు.

ఇక రాంచరణ్ డ్రీమ్ అయిన మిలియన్ డాలర్ల కల కూడా నెరవేరే అవకాశం కూడా లేకపోలేదు. ప్రీమియర్ షోల కలెక్షన్లు నిరాశ పరిచినా. రెండో రోజు వసూళ్లు కాస్త బెటర్ గా ఉన్నాయి. వీకెండ్ అయ్యేసరికి వసూళ్లు 7-8 లక్షల డాలర్లకు చేరొచ్చని భావిస్తున్నారు. ఈ వారం చెప్పుకోదగ్గ చిత్రం లేకపోవటంతో చెర్రీ మిలియన్ డాలర్ డ్రీమ్ నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

గ్యారేజ్ రికార్డును బ్రేక్ చేసింది..

ఓవరాల్ కలెక్షన్ల విషయంలో కాదులేండి. రిలీజ్ అయిన రెండో రోజు( ఫస్ట్ శనివారం) విషయంలో.. ఈ లిస్ట్ లో ఈ యేడాది అ.ఆ.. టాప్ ఫ్లేస్ లో ఉండగా, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నాగ్ ఊపిరి ఉండగా, గ్యారేజ్ ను వెనక్కి నెట్టి ధృవ ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan Dhruva Collections  Weekend Dhruva Collections  

Other Articles