శాతకర్ణి ఆడియో హైలెట్స్.. ఎవరేం మాట్లాడారు? | Satakarni Audio event full speech.

Balayya satakarni audio highlights

Gautamiputra Satakarni Audio, GSP AUdio Function, Satakarni Audio Highlights, Balayya Satakarni, Celebs speech at Balayya GSP Audio, Satakarni Audio Launch event, Gautamiputra Satakarni Audio launch, Satakarni Audio launch, Balayya dress at Satakarni Audio launch, Bala Krishna New Movie, Bala Krishna Gautamiputra Satakarni Movie

Bala Krishna 100th Movie Gautamiputra Satakarni Audio release Highlights.

బాలయ్య శాతకర్ణి ఆడియో హైలెట్స్

Posted: 12/27/2016 07:57 AM IST
Balayya satakarni audio highlights

గౌతమి పుత్ర కథ తీయాలనుకున్నపుడు ఒక అద్భుతమైన రూపం ఆవిష్కరణమైంది. ఒక కథే కథానాయకుడిని ఎన్నకుంటుంది. బాలయ్య మాత్రమే నా శాతకర్ణి ఖ్యాతిని దశదిశలా ఇనుమడించగలడు అనిని డిసైడ్ అయి. తెలుగు జాతి గర్వపడే సినిమా తీసాను, ఇదేదో టిక్కెట్ల కోసం చెబుతున్న మాట కాదు అంటున్నాడు దర్శకుడు క్రిష్. సోమవారం తిరుపతిలో అంగరంగ వైభవంగా శాతకర్ణి ఆడియో వేడుక జరిగింది. ఈ సందర్భంగా క్రిష్ ఉద్వేగపూరితంగా ప్రసగించాడు.

శాతకర్ణి శాసనాలు లండన్ లో ఉన్నాయి. శాతకర్ణిని మహరాష్ట్రీయులు, తమిళులు పూజిస్తున్నారు. మనకి మాత్రం చేతకావడం లేదు. దౌర్భాగ్యం ఏంటంటే మనదగ్గర ఆయనకు సంబంధించిన ఎలాంటి చరిత్ర ఆనవాళ్లు లేవు. ఆయన గ్రీకు దేశంలో పుట్టినట్లయితే ఆయనపై ఇప్పటికే అనేక పుస్తకాలు వచ్చేవి, హాలీవుడ్లో పది సినిమాలు వచ్చేవి అని క్రిష్ చెప్పుకొచ్చారు.ఎప్పుడో గౌతమీపుత్రి శాతకర్ణి అమరావతిని రాజధానిని చేసుకుని పాలించారు. ఇప్పుడు అదే అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇదంతా మా సినిమాకు దైవ సంకల్పంలా కలొసొచ్చింది. కోటి లింగాల నుంచి ఆరంభమైన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర కన్యాకుమారి నుంచి హిమాచలం వరకు విస్తరించింది. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది అని క్రిష్ అన్నాడు.

బాలయ్య బాబు ఈ సినిమాకు ఒప్పుకున్నందుకు థాంక్స్. ఆయన ఈ సినిమా కోసం రోజుకు 14 నుండి 18 గంటలు గంటలు శ్రమించారు అని క్రిష్ తెలిపారు. అమ్మా నా పేరు ముందు నీ పేరు వేశాను...నీ పేరు నిలబెడతాను, పెళ్లైన తరువాత పట్టుమని పదిరోజులు కూడా నా భార్య రమ్యతో గడపలేదు, మనిద్దరం గర్వపడే సినిమా తీశాను అని తన తల్లి, భార్యను ఉద్దేశించి చెప్పుకొచ్చాడు.


సినిమా అంటే కేవలం వినోదమే కాదు ... బాలయ్య

భారత దేశాన్ని ఏకఛత్రాధిప్యతం కింద పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి, కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఆయన జన్మించారు, అలాంటి తెలుగు వ్యక్తి గురించి మనకు సరిగ్గా తెలియకపోవడం దారుణమని నటుడు బాలకృష్ణ అన్నారు. నటుల నుంచి అద్భుతమైన నటన రాబట్టే సామర్థ్యమున్న దర్శకుడు క్రిష్ అని ఈ సందర్భంగా బాలయ్య ప్రశంసించాడు. వందో సినిమా కోసం చాలా కథలు విని అంగీకరించని దశలో ఉండగా ఆయన కథ చెప్పడం, ఆ కధను తాను అంగీకరించడం జరిగిందని అన్నారు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందన్నాడు. సినిమా అంటే వినోదం మాత్రమే కాదని, తెలుసుకోవాల్సిన గొప్ప విషయమని ఈ సినిమా ద్వారా నిరూపితమవుతుందన్నాడు బాలయ్య. ఇక వేడుకలో ప్రత్యేక పంచె కట్టు వేషాధారణతో బాలయ్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

బాలయ్య పూర్వజన్మ సుకృతం: సీఎం చంద్రబాబు

బాలకృష్ణ సినీ ప్రస్థానం చూస్తే చాలా ఆసక్తికరమని అన్నారు. ఈ సినిమాలో నటించడం బాలకృష్ణ పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఈ సమయంలో ఈ సినిమా తీయడం ఆనందకరమని, ఈ సినిమా చూసి, అంతకు మించిన రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు. తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠలను దిగంతాలకు వ్యాపింపజేసిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి, రాజులెందరున్నా...గౌతమీపుత్ర శాతకర్ణి ప్రత్యేకమైన వ్యక్తి అన్నారు. రాజ్యాలన్నీ ఓడించి, ఏకరాజ్యంగా దేశాన్ని ఏలిన వ్యక్తి తెలుగువాడైన, అమరావతిని రాజధాని చేసుకుని పాలించిన వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణిని స్మరించుకోవడం ఎంతైనా ముదావహమని ఆయన చెప్పారు. లెజెండ్ చిత్రం వెయ్యి రోజులు ఆడింది, గౌతమీపుత్ర శాతకర్ణి వెయ్యి రోజుల కంటే ఎంతో ఎక్కువ కాలం ఆడుతుందని అన్నారు. హేమమాలిని, బాలకృష్ణ తల్లిగా నటించడం గొప్పవిషయమని అన్నారు. ఈ సినిమాను క్రిష్ గొప్పగా తీశారని చంద్రబాబు కొనియాడాడు.

పాండవ వనవాసంతో మొదలైంది... హేమామాలిని

గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీలో శాతకర్ణి తల్లి గౌతమి బాల పాత్ర పోషించిన హేమా మాలిని మాట్లాడుతూ....ఈ సినిమాలో మంచి పాత్ర పోషించే అవకాశం కల్పించిన ఈ చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ నటించిన 'పాండవ వనవాసం'లో తాను తొలిసారి నటించానని, అందులో చిన్న పాత్ర చేసాను, గౌతమిపుత్రశాతకర్ణిలో బాలకృష్ణ తల్లిగా నటించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమా సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పుకోచ్చారు.


నేను ఎందుకొచ్చానంటే... వెంకయ్య నాయుడు

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ....ఈ కార్యక్రమానికి సీఎం వచ్చారంటే అర్ధముంది...ఆయన హీరో వియ్యంకుడు. నేను ఎందుకు వచ్చాను అని అంతా అనుకోవచ్చు, తాను సినిమాలతో సంబంధం ఉన్న సమాచార ప్రసార శాఖ మంత్రిని అందుకే వచ్చానని అన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా మన వారసత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా సినిమాను వినోదం కోసం తీస్తారు. కానీ ఈ సినిమాను చరిత్రను తెలిపే విధంగా తీయడం గొప్పవిషయమన్నారు. తెలుగు వారి కీర్తి దశదిశలా నడిపించిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు, ఆయన పేరు నిలబెట్టేలా బాలయ్య ఈ సినిమా చేస్తున్నారన్నారు.


బోయపాటి మాట్లాడుతూ... గజగజ వణికించే చలిలో వేడిపుట్టించాలన్నా, భగభగలాగే మంటలో కన్నీటి బింధువు రాల్చాలన్నా బాలయ్యకే సాధ్యం. 'చరిత్ర నెలకొల్పాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్నా మేమే' అని లెజెండ్ సినిమాతో నిరూపించారు. అమరావతి ఘన చరిత్ర ప్రతి తెలుగు వాడికీ తెలియాలని గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నారు. ఇది అంతా వందో సినిమా అంటున్నారు. కానీ ఇది వందో సినిమా కాదని, వంద సెంటర్లలో వందరోజులు ఆడే సినిమా అన్నారు.

ఆ సత్తా క్రిష్ కు మాత్రమే ఉంది.... సిరివెన్నెల

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ...శాతవాహనులు పాలించిన 400 సంవత్సరాల్లో 25వ చక్రవర్తి 'గౌతమీపుత్ర శాతకర్ణి', 32 మంది రాజులను జయించి, వారి ఖడ్గాలను సొంతం చేసుకుని, శాంతి ఖడ్గంగా మార్చిన గొప్ప చక్రవర్తి 'గౌతమీపుత్రి శాతకర్ణి', తెలుగుజాతి గర్వించదగ్గ గొప్ప చక్రవర్తి. ఇలాంటి గొప్ప రాజు చరిత్రను దర్శకుడు క్రిష్ చిత్రీకరించిన విధానం అద్భుతం. ఈ సినిమా వల్ల తెలుగు వారిలో నిద్రాణమైఉన్న జాతి భక్తి జాగ్రుతమవుతుందన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో రిస్క్ తీసుకుని క్రిష్ ను నమ్మి ఈ ప్రాజెక్టు అప్పగించిన నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారు. ఈ సినిమా తీయగల ధైర్యం క్రిష్ కు మాత్రమే ఉందని, అలాగే ఈ పాత్రను చేయగల ధైర్యం బాలయ్యకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీయా సరన్, నిర్మాత సురేష్ బాబు, సీనియర్ దర్శకుడు కొదండ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా. బాలయ్య సరసన శ్రియా హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ బాలయ్య తల్లిగా కీలకమైన గౌతమీ పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ ఓ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నాడు. సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balayya 100th Movie  Gautamiputra Satakarni  Audio launch  

Other Articles