రాధకు వర్మ ఓపెన్ ఛాలెంజ్.. నిజాలు చూపిస్తే తట్టుకోలేవ్... | Varma challenge Radha.

Varma counter to vangaveeti radha krishna

Ramgopal Varma, Basti mein sawal Varma, Vangaveeti Radha Krishna, Real Vangaveeti, Varma Challenge, RGV open Challenge, Vangaveeti Challenge, varma counter to Radha, Vangaveeti Movie, Vangaveeti Ranga Buddha Gandhi Teresa

Director Ramgopal Varma reacts on Vangaveeti Radhakrishna's comments.

అసలు రంగ ఏంటో అందరికీ తెలుసు: వర్మ

Posted: 12/26/2016 04:19 PM IST
Varma counter to vangaveeti radha krishna

తనపై వంగవీటి వారసుడు, వైసీపీ విజయవాడ నేత వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వర్మ సీరియస్ అయ్యాడు. తాను తీసిన ‘వంగవీటి’ కరెక్ట్ కాదనుకుంటే ‘అసలు వంగవీటి’ అని మరో సినిమాను వంగవీటి రాధా తీసుకోవాలంటూ చురకలు అంటించాడు. ‘వంగవీటి’గురించి దుర్బుద్ధి ఉన్న వాళ్లు తన దురుద్దేశ్యం గురించి ఎంత మొత్తుకున్నాసరే... పచ్చి నిజం ఏమిటంటే, వంగవీటి రంగాపై రాధాకి, రత్నకుమారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు తనకు ఎక్కువ గౌరవము ఉందన్నారు. ఈ నిజం.. నిజాయతీగా తమ గుండెలపై చేయి వేసుకున్న నిజమైన రంగా అభిమానులకు తెలుసని అన్నారు. ఈ సందర్భంగా తన సినిమాను అడ్డుకోవాలని చూస్తున్న రాధకు కొన్ని ప్రశ్నలు సంధించాడు వర్మ.

1. రంగా గారు బోసిపళ్ళ మహాత్మా గాంధీ అని చూపించాలా?
2. మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?
3. మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?
4. అన్న దానాలు,ప్రజా సేవ తప్ప చీమకైనా హాని చెయ్యని గౌతమ బుద్దుడని చూపించాలా?

అంతేకాదు వాస్తవాలే చూపించాల్సిందన్న రాధా డిమాండ్లకి సరైన సమాధానమే చెప్తా. రంగా గారి గురించి ఆయన భార్య గురించి, రంగా గారి అభిమానులు వినటానికి చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చాలా చూపించగలను… కాని రంగా గారి మీద వున్న గౌరవంతో అవి చూపించలేదు. జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ళ సున్నితమైన భావోద్వేగాలని చూపించడం మాత్రమే నా ఉద్దేశం. వంగవీటి విషయంలోనూ అదే చేశాను.

ఒరిజినల్ వంగవీటి రాధా, వంగవీటి రంగా గార్లలో ఉన్నగొప్పతనంలో 0.1%లేకపోవడం మూలానే రాధా ఏమి అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు.ఇకపోతే నన్నేదో చేసేస్తానన్న రాధా ఇచ్చిన వార్నింగ్ కి నా కౌంటర్ వార్నింగ్. బస్తీ మే సవాల్– సెంటర్ నేను చెప్పను- టైం నువ్వు చెప్పొద్దు అంటూ భారీ డైలాగ్ తో ముగించాడు వర్మ. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Counter  Vangaveeti Movie  Radha krishna  Counter  

Other Articles