హీరోలన్నాక ఏదో ఒక సందర్భంలో రీమేకో, ప్రయోగమో చేయక తప్పదు. అయితే అగ్రహీరోల్లో మాత్రం అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నటనే ఊపిరిగా ఉన్న నందమూరి నట వారసత్వం నుంచి వచ్చిన బాలకృష్ణకు రీమేక్ ల అలవాటు చాలా తక్కువనే అనుకోవాలి. విఫలమైనా సరే డేరింగ్ గా కొత్త కథలు, కొత్త దర్శకులు అంటూ వైవిధ్యతను ప్రదర్శిస్తుంటాడాయాన. అలాంటి తన 42 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ ప్రయోగాలకు వెనక్కి తగ్గలేదు. అలా అనుకుని ఉంటే ఓ ఆదిత్య 369, ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన సమరసింహరెడ్డి, నరసింహానాయుడు లాంటి చిత్రాలు వచ్చి ఉండేవే కాదు. ఇక మైలు రాయి లాంటి వందో సినిమా కోసం నటసింహం చేస్తున్న సాహసానికి సలాం కొట్టి తీరాల్సిందే.
వందో చిత్రం ఎంపిక...
వందో చిత్రం కోసం ఎన్నో కథలు విన్నాడు. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం డైరక్షన్ లో 999 అనే ఓ చిత్రాన్ని తీద్దామన్న ఫ్లాన్ వేసుకున్నాడు. అయితే అభిమానుల నుంచి ప్రయోగం చేయొద్దన్న విజ్నప్తులు, ఒత్తిడి రావటంతో చివరకు తనకు సింహ, లెజెండ్ లతో పూర్వ వైభవం తీసుకొచ్చిన బోయపాటిని ఎన్నుకున్నాడు. కథ సిద్ధం చేస్తున్నానని ప్రకటించాడు. అప్పటికే 99వ చిత్రం వచ్చి, విడుదల మంచి టాక్ నే సంపాదించుకుంది. మూడు నెలలు గడిచాయి. కానీ, వందో చిత్రంపై ఎక్కడా క్లారిటీ లేకపోయింది. అభిమానుల్లో ఒకటే ఆందోళన...
తెరపైకి క్రిష్ పేరు...
ఇంతలో తెరపైకి ఓ సర్ ప్రైజింగ్ పేరు. గమ్యం, వేదం లాంటి విభిన్న చిత్రాలను తీసిన జాగర్లమూడి క్రిష్ అలియాస్ క్రిష్. తన వందో చిత్ర బాధ్యతలను బాలయ్య అతనికి అప్పజెప్పాడనగానే అభిమానుల్లో ఓ కంగారు. సాఫ్ట్ సినిమాలు తీసే అతగాడు నటసింహంను ఏం చూపించగలడు? అయితే రెండో ప్రపంచ యుద్ధంపై కంచె లాంటి క్లాసిక్ మూవీ తీసి జాతీయ అవార్డు గెలుచుకున్న క్రిష్ పై నమ్మకం మాత్రం వదులుకోలేదు. దానికి తగ్గట్లే ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథనంతో ప్రాజెక్టును తెరకెక్కించే ప్రయత్నం చేయబోతున్నా అంటూ గర్వంగా చెప్పుకుని క్రిష్ ఆ సెగను మరింత పెంచాడు.
శాతకర్ణి స్పెషాలిటీ?
ఆంద్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజులలో 23వ వాడు శాతకర్ణి (శాలివాహనుడు-క్రీ.పూ. 78-102). తల్లి గౌతమీ అతన్ని వీరుడిగా తీర్చిదిద్దటంతో పేరు ముందు గౌతమీపుత్రగా నామకరణం జరిగింది. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరిస్తే.. కొడుకు శాలివాహనుడు ఆ విజయ పరంపరను. శకులను, యవనులను, పల్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెవటమే కాదు, భారత దేశాన్నంతా పరిపాలించిన తొలి, మరియు తెలుగు చక్రవర్తి ఇతనే. అరవీర భయంకరుడిగా విదేశీ శక్తులను ముప్పుతిప్పలు పెట్టి దేశ కీర్తిని ఖండాంతరాలు దాటించాడు.
ఓ తెలుగువాడు. పైగా మన గడ్డపై పుట్టిన ఈ వీరుడి గురించి ఇంత వరకు ఎవరికీ పూర్తిగా తెలియదు. మరి అలాంటి వ్యక్తి జీవితగాథను నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రకటించాడు. ఖండఖండాలు గావున్న భారతాన్ని అఖండ భారతావనిగా చేసిన చక్రవర్తి శాతకర్ణి జీవిత గాథను సినిమాగా తెరకెక్కించటం కత్తి మీద సామేనని ఒప్పుకుంటూ బాలయ్య ఇమేజ్ దెబ్బతీయకుండా, విజయవంతంగా తెరకెక్కించేందుకు యత్నిస్తానని ప్రాజెక్టు అనౌన్స్ చేసిన సమయంలో క్రిష్ నందమూరి అభిమానులకు మాటిచ్చాడు కూడా.
మరి బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రతిష్టాత్మక పిరియాడికల్ ఫిల్మ్ ను తెరకెక్కించేదెవరు? వెంటనే క్రిష్ సన్నిహితులు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు ముందుకు వచ్చారు. 55 కోట్ల బడ్జెట్(50 అనుకుంటే మరో 5 కోట్లు ఎక్కువైందని అధికారిక ప్రకటన చేశారు కూడా. సంగీతం కోసం దేవీశ్రీప్రసాద్ ను తీసుకోవటం, రిరికార్డింగ్ మొదలు పెట్టడం జరిగిపోయాయి. అనూహ్య పరిణామాలతో దేవి తప్పుకోగా, మెలోడీ మాస్ర్టో ఇళయరాజా, కీరవాణిల పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే చివరకు ఆ అవకాశం కంచె కు స్వరాలు ఇచ్చిన చిరంతన్ భట్ కే దక్కింది. హీరోయిన్ గా నయనతార పేరు అనుకున్నప్పటికీ చివరకు శ్రీయా సెట్ అయిపోయింది.
రాజమాత పాత్ర కోసం ఆ హంగు తగ్గ కుండా ఉండేందుకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినిని తీసుకున్నారు. మరో నటుడు కబీర్ బేడీ కీలకపాత్ర కోసం ఎంపిక చేశారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తో ఓ అతిథి పాత్ర. మొత్తానికి అంతా సిద్ధమైపోయింది. షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం చేయబోతున్నారు అన్నదే చర్చ.(తర్వాతి పేజీలో...)
ఏప్రిల్ 8 2016 ఉగాది పర్వదినాన నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా అనౌన్స్ మెంట్ జరిగిపోయింది. మరో రెండు వారాల తర్వాత హైదరాబాద్ లో సినిమా ఓపెనింగ్ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి పొలిటికల్ సెలబ్రిటీ ముఖ్యఅతిథిగా, దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, సింగీతం శ్రీనివాస రావు, చిరంజీవి, వెంకటేష్, సాయి కొర్రపాటి, బోయపాటి, తదితరుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. మంచి కథను ఎంచుకున్న బాలయ్య ను అభినందించటమేకాదు, సినిమా తొలిరోజు తనకు కూడా ఆట చూడాలని ఉందని స్వయానా టీ ముఖ్యమంత్రి ప్రకటించటంతో అంతా హర్షం వ్యక్తం చేశారు. తోటి నటులు కూడా సినిమా ఘన విజయం సాధించాలని అభినందనలు తెలిపాడు.
అంతర్జాతీయ ప్రస్థానం...
సినిమా మొదలైంది రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభించారు. అప్పటికే ఫస్ట్ లుక్ ను విడుదల చేయటం, దానికి విశేష స్పందన రావటం జరిగిపోయాయి. ఆలస్యం చేయకుండా షూటింగ్‌ను మొరాకోకు షిఫ్ట్ చేసి మొదలుపెట్టేశాడు క్రిష్. ఆపై ఈజిప్ట్ షెడ్యూల్, జార్జియా, ఇండియాకు షిఫ్ట్ అయి రియాలిటీ కోసం మధ్యప్రదేశ్ లోని కోటల్లో కీలక సన్నివేశాలకు కానిచ్చేశాడు. ఇక వాటర్ వార్ ఎపిసోడ్స్ కోసం గండిపేటలో సెట్ వేసి షూటింగ్ కానిచ్చాడు.
శాతవాహనుల కాలంనాటి కథ. పైగా శాతకర్ణి. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కథ. ఆడియన్స్‌ను ఆనాటి కాలానికి తీసుకెళ్లాలంటే అలాంటి వాతావరణం క్రియేట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. భారీ సెట్లు, బడ్జెట్లు, కాల్షీట్లు.. ఇలా చాలా కావాలి. ఈ క్రమంలో మరో ప్రెస్టిజీయస్ సినిమాతో పోలిక. ఇవేవీ క్రిష్ ను దృష్టి మరచలేకపోయాయి. ఏదైతే నేం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రీతిలో కేవలం 80 రోజుల్లో నాన్ స్టాప్ గా సినిమాను పూర్తి చేసేశాడు.
ఆ గట్స్ బాలయ్యకు మాత్రమే...
ఇండస్ట్రీలో ఎవరూ చేయలేని ధైర్యం. చివరకు తన తండ్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు కలగా మిగిలిపోయిన కథ. దాన్నే వందో సినిమాగా చేస్తున్నానని ప్రకటించాడు. తెలుగు జాతి మొత్తం తెలుసుకోదగ్గ కథ, తెలుగు వాడికి తెలియని తెగుగోడి కథ. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి గాథనే తన పాత్రగా ఎంచుకున్నాడంటూ అభినందనలు కురిశాయి.
టీజర్ వచ్చింది అంతగా ఆకట్టుకోలేదు. నాలుగు యుద్ధ సన్నివేశాలు కేవలం రెండుగంటల పది నిమిషాల్లో ఏం చెబుతాడంటూ పెదవి విరచారు. కానీ, ముందుంది అసలు పండగా అని తర్వాతే అర్థమైంది. ట్రైలర్ వచ్చింది. దెబ్బకు ఆ నెగటివ్ మార్క్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మేకింగ్ వీడియోల్లో రాజసం ఎక్కడా తగ్గలేదు. దానికి తోడు జ్నాన శేఖర్ గ్రాండ్ సినిమాటోగ్రఫీ అద్భుతం. వీడియోలో బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు పేలిపోయాయి.
తిరుపతిలో గ్రాండ్ గా ఆడియో. అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయని వేడుకలో బాలయ్య హామీ ఇచ్చేశాడు. తెలుగు భాష, సంస్కృతి ఉన్నతికి కృషిచేసిన గౌతమీపుత్ర శాతకర్ణి పై సినిమా, భారతదేశమే గాదు ప్రపంచమంతా గర్వపడేలా సినిమా రూపొందనుందని క్రిష్ నినందించాడు. ఈ తెలుగు వీరుడి గొప్పతనం తెలీకుండా నిద్రాణంలో ఉన్న తెలుగువాళ్లకు శాతకర్ణి కనువిప్పు అంటూ ఉద్వేగపూరిత ప్రసంగం... ఇవి చాలవా వాళ్లు ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పటానికి.
తల్లి పేరును తగిలించుకుని తెలుగు జాతి గౌరవం కాపాడిన ఆ పోరాటయోధుడిలో ఈ బసవ తారక పుత్ర పరకాయ ప్రవేశం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తే అందరి మదిలో... సినిమా ప్రారంభోత్సవం నాడే "సంక్రాంతి సినిమా" అని సగర్వంగా ప్రకటించారు. అన్నమాట ప్రకారం విజువల్ వండర్ పందెనికి సిద్ధమైపోయింది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. సమయం లేదు మిత్రులారా! శాతకర్ణి దండయాత్రకు సిద్ధమైపోండి మరి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more